Advertisement
Google Ads BL

‘జెర్సీ’కి ఇలా అవుతుందని ఊహించి ఉండరు!


నేచురల్‌స్టార్‌ నాని కెరీర్‌లోనే గౌతమ్‌తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ చిత్రం అద్భుతమని సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. గౌతమ్‌ మొదటి చిత్రం ‘మళ్లీరావా’ చిత్రం కూడా మంచి మూవీనే అయినా హీరోకి ఇమేజ్‌ లేక ఫేడవుట్‌ అయినవాడు కావడం, మార్కెట్‌ పరిధి చాలా తక్కువగా ఉండటం వల్ల ఆ చిత్రం సరిగా ఆడలేదని, కానీ రెండో చిత్రం ‘జెర్సీ’కి నేచురల్‌స్టార్‌ నాని యాడ్‌ కావడం వంటి బిగ్గెస్ట్‌ హిట్‌ పక్కా అనుకున్నారు. కానీ కొన్ని చిత్రాలు ఎంత బాగున్నా కలెక్షన్లు నిరాశపరుస్తాయి. అదే కొన్ని చిత్రాలలో కంటెంట్‌ లేకపోయినా వాటిని ప్రేక్షకులు ఆదరిస్తారు. దీని వెనుక కారణాలను ఎవ్వరూ విశ్లేషించలేరు. ప్రస్తుతం ‘జెర్సీ’ పరిస్థితి అలానే ఉంది. 

Advertisement
CJ Advs

బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వచ్చిన ‘జెర్సీ’కి పూర్తిగా నెగటివ్‌ టాక్‌ వచ్చిన ‘కాంచన 3’ బ్రేకులేస్తోంది. బి,సి సెంటర్లలోనే కాదు.. హైదరాబాద్‌ మహానగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ థియేటర్లలో కూడా దాదాపు ‘జెర్సీ, కాంచన3’ల కలెక్షన్లు ఇంచు మించు సమానంగా ఉండటం విశేషం. మరోవైపు తెలుగునాట మజిలీ, చిత్రలహరి, జెర్సీ వంటి చిత్రాల హవా ఉన్నా కూడా తమిళ ‘కాంచన 3’కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తమిళ, తెలుగు భాషల్లో కలిపి ఈ చిత్రం మొదటి వారంలోనే 100కోట్ల గ్రాస్‌ని వసూలు చేసింది. ఈ ఫీట్‌ సాధించడం లారెన్స్‌కి ఇదే మొదటిసారి. ‘కాంచన’ కూడా బాగా ఆడినా ఆ చిత్రం ఈ మైలురాయిని అందుకోలేకపోయింది. అంచనాలు భారీగా ఉండటం, కాంచన అనే టైటిల్‌ వల్ల క్రేజ్‌ పెరగడం, ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడం, బి,సి, మాస్‌ ప్రేక్షకులను బాగా అలరించడం వంటివి ‘కాంచన 3’కి ఎస్సెట్‌ అయ్యాయి. 

కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో పాటు హర్రర్‌ కామెడీ కావడం వల్ల కూడా దీనిని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ‘కాంచన 3’ ఇచ్చిన బూస్ట్‌తో త్వరలో లారెన్స్‌ ‘కాంచన 4’ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. డైరెక్టర్‌ అయిన మొదట్లో ‘మాస్‌, స్టైల్‌, డాన్‌’ వంటి విభిన్న చిత్రాలు తీసిన లారెన్స్‌ కాంచన సిరీస్‌లో భాగంగా అన్ని చిత్రాలను కాస్త అదే పోకడలో తీస్తున్నప్పటికీ ఇవి కమర్షియల్‌గా పెద్ద హిట్స్‌ కొట్టడం చూస్తుంటే లారెన్స్‌ సుడి బాగా ఉందనే అర్ధమవుతోంది. 

Kanchana 3 Effect on Jersey:

Jersey Collections Droped
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs