Advertisement
Google Ads BL

అదే జరిగితే రౌడీస్టార్ కూడా సూపర్‌స్టారే!


‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యూత్ లో గుర్తుండిపోయే ముద్ర వేసుకున్న రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ఆ తరువాత వచ్చిన ‘గీత గోవిందం’ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా రూట్ మార్చి ‘డియర్‌ కామ్రేడ్‌’ అనే డిఫరెంట్ జోనర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో యాభై కోట్ల వరకు బిజినెస్‌ చేసినట్లు టాక్ నడుస్తోంది.

Advertisement
CJ Advs

నాలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాతో విజయ్ తమిళం, మలయాళం, కన్నడంలో కూడా మార్కెట్ ఏర్పరచుకోనున్నాడు. విజయ్ తన తదుపరి చిత్రాలన్ని మల్టిపుల్‌ లాంగ్వేజెస్‌లోనే చేయాలని నిర్ణయించుకున్నాడట.

తద్వారా మిగిలిన రాష్ట్రాల్లో కూడా యాభై కోట్ల బిజినెస్‌ వరకు రీచ్‌ అయితే తన మార్కెట్‌ కూడా వంద కోట్లకి చేరుకునే వీలుంటుంది. చాలా మంది మన తెలుగు స్టార్స్ ఇటువంటి ఫీట్స్ చేసున్నారు. కానీ ఎవరు అంతగా క్లిక్ అవ్వలేదు. మరి విజయ్ ఎంతవరకు క్లిక్ అవుతాడో చూద్దాం. క్లిక్ అయ్యాడో.. దక్షిణాది ఇండస్ట్రీలో మరో సూపర్ స్టార్ అవ్వడం ఖాయం. ‘డియర్‌ కామ్రేడ్‌’ ప్రస్తుతం రీషూట్‌లో ఉంది. మే 1న చిత్రం నుంచి మరో సాంగ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Rowdy Star Turns Super Star with Dear Comrade:

Vijay Deverakonda Takes Sensational Decision on his Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs