సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి హాలిడేస్ కి పారిస్ ట్రిప్ వెళ్ళాడు. కొన్ని రోజుల్లో వెనక్కి తిరిగొచ్చి ‘మహర్షి’ ప్రమోషన్స్ లో హాజరు అవుతాడు. ఆ వెంటనే అనిల్ రావిపూడి సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్తాడు. ఎఫ్ 2 తో మంచి జోష్ మీద ఉన్న అనిల్ తన నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ అధికారంగా లాంచ్ చేయనున్నారు.
ఈ సినిమాకి ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ పెట్టాలని టీం భావిస్తోందట. వినడానికి పవర్ ఫుల్ టైటిల్ లా ఉంది. మహేష్ కి ఎప్పటినుండో మూడు అక్షరాల టైటిల్ సెంటిమెంట్ ఉంది. అయితే ఆగడు, స్పైడర్ లాంటి సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసేందుకు ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ కు మహేష్ ఓకే చెప్పినట్టు సమాచారం.
అయితే అనిల్ ఈ టైటిల్ ను ఎప్పుడో ఫిక్స్ అయ్యాడట. ఇప్పటివరకు అనిల్ కు అన్ని ఇంగ్లీష్ టైటిళ్లే అచ్చి వచ్చాయి. ఫస్ట్ టైమ్ ఆయన కూడా ఫర్ ఏ ఛేంజ్ తెలుగు టైటిల్ పెట్టాలనుకుంటున్నారు. దిల్ రాజు కూడా ఈ టైటిల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. త్వరలోనే మిగిలిన డీటెయిల్స్ తెలియనున్నాయి.