Advertisement
Google Ads BL

సెట్స్‌పైకి వెళ్లలేదు.. అప్పుడే ‘ఐకాన్‌’ స్టోరీ లీకా?


‘డిజె’కి కలెక్షన్లు వచ్చి ఉండవచ్చుగానీ ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సామాన్య ప్రేక్షకులు కూడా ఇది రొటీన్‌ చిత్రమని చెప్పి పెదవి విరిచారు. ఇక ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ బన్నీకి అసలు సిసలైన బొమ్మ చూపించింది. ఆ షాక్‌ నుంచి తేరుకోవడానికి ఆయనకు ఏడాదికి పైగా కాలం పట్టింది. కానీ ఈ గ్యాప్‌లో బన్నీవరసగా మూడు చిత్రాలు ఓకే చేశాడు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో గీతాఆర్ట్స్‌, హారిక అండ్‌ హాసిని సంయుక్త భాగస్వామ్యంలో రూపొందే చిత్రం తాజాగా రెగ్యులర్‌ షూటింగ్‌ని మొదలుపెట్టుకుంది. దీని తర్వాత బన్నీ దిల్‌రాజు నిర్మాతగా వేణుశ్రీరాం దర్శకత్వంలో ‘ఐకాన్‌’ అనే చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం టైటిల్‌తో కూడిన పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. టైటిల్‌ సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనేలా ఉంది. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రంలో బన్నీ మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేస్తాడని కొందరు అంటుంటే.. కాదు బన్నీ ఇందులో రెండు విభిన్న గెటప్‌లలో కనిపిస్తాడనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక ఈ ‘ఐకాన్‌’ పోస్టర్‌ని విడుదల చేసిన తర్వాత ఈ చిత్రం ‘కిటకిట’ అనే ఫిలిప్పీన్స్‌ చిత్రానికి స్ఫూర్తి అని విమర్శలు వచ్చాయి. అయితే తమ చిత్రం ‘కిటకిట’ కాదని, ఇంతకు ముందే రోడ్డు జర్నీ నేపధ్యంలో పలు చిత్రాలు వచ్చాయని యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. కాబట్టి ఈ అనుమానం క్లియర్‌ అయింది. 

ఇక తాజా అప్‌డేట్‌ ప్రకారం బన్నీ ఈ చిత్రంలో తన బైక్‌ పోతే పోలీస్‌స్టేషన్‌లో కేసు పెడతాడు. సాధారణమైన విషయమే కదా..! అని పోలీస్‌ వారు పెద్దగా పట్టించుకోరు. దాంతో బన్నీఈ విషయంలో మైండ్‌గేమ్‌ మొదలుపెడతాడు. చిర్రెత్తుకొచ్చిన బన్నీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ మొత్తం షేకయ్యేలా చేస్తాడు. ఈ క్రమంలోనే బన్నీకి హీరోయిన్‌ పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఎన్నోనాటకీయ మలుపుల తర్వాత కథ పూర్తిగా యాక్షన్‌ మోడ్‌లోకి వెళ్తుంది. ఈ మొత్తం జర్నీబ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుందని అంటున్నారు. మరి అసలు స్టోరీ పాయింట్‌ ఇదేనా? కాదా? అనేది తెలియాలంటే వేచిచూడాల్సివుంది..! 

Is this Allu Arjun Icon Movie Story?:

Bunny ICON Movie Story Leaked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs