Advertisement
Google Ads BL

బ్యాడ్‌ సెంటిమెంటే ఈ కుర్రహీరోకి కలిసొస్తోంది!


ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి చిత్రం విడుదలలో వాయిదాలు పడుతూనే ఉన్నాయి. పోటీ చిత్రాలు అధికంగా ఉండటం, ఆ పోటీ మనకి వద్దులే... సోలో రిలీజ్‌ చూసుకుందామని కొందరు... పోటీ చిత్రాల వల్లసరైన థియేటర్లు లభించవని, ఓపెనింగ్స్‌పై కూడా ఆ ప్రభావం పడుతుందని తమ సినిమాలను వాయిదాలు వేసేవారు ఒకరైతే పెద్దస్టార్స్‌ చిత్రాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి? మధ్యలో ఆర్టిస్టులకు గాయాల వంటి విపత్తులు అనుకున్న సమయానికి పోస్ట్‌ ప్రొడక్షన్‌, గ్రాఫిక్స్‌, విఎఫ్‌ఎక్స్‌లు పూర్తికాకపోవడం, బాగా రాని సీన్స్‌ని మరలా రీషూట్‌ చేయడం వంటివి ఎన్నో ఉంటాయి. ‘బాహుబలి’ నుంచి మే9న రానున్న‘మహర్షి’, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వరకు ఇదే తంతు నడుస్తోంది. కానీ ఇలా సినిమా రిలీజ్‌డేట్‌ని వాయిదాపడి పోస్ట్‌పోన్‌కావడం సినిమా ఫలితంపై తేడా చూపుతుందని, ముఖ్యంగా సినిమాలో ఏదోతేడా ఉంటేనే ఇలా జరుగుతాయనే సెంటిమెంట్‌ బలంగా ఉండటం వల్ల కూడా ఈ బ్యాడ్‌సెంటిమెంట్‌ ఏర్పడుతుంది. ముఖ్యంగా పెద్ద చిత్రాల సంగతేేమో గానీ సినిమా విడుదల వాయిదా పడటం చిన్న, మీడియం చిత్రాల అంచనాలను బాగా తగ్గిస్తుంది. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే యంగ్‌హీరో నిఖిల్‌ నటించిన తమిళ కణితన్‌ రీమేక్‌ని ఫిబ్రవరిలోనే విడుదల చేస్తామన్నారు. తర్వాత మార్చి, మరలా మేకి పోస్ట్‌పోన్‌ అయింది. తాజాగా ఈ చిత్రం మే1న కూడా విడుదల కావడం లేదు. అసలు ఈ చిత్రానికి మొదట ‘ముద్ర’ అనే టైటల్‌ పెట్టారు. కానీ మరో నిర్మాత ఇదే టైటిల్‌ని రిజిష్టర్‌ చేయించి, హడావుడిగా సినిమాని విడుదల చేశాడు. దాంతో ఈ చిత్రం టైటిల్‌ని హీరో క్యారెక్టర్‌ పేరు మీదుగా ‘అర్జున్‌ సురవరం’ అని ఫైనల్‌ చేశారు. ఇలా ఈ చిత్రానికి మొదటి నుంచి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. 

ఇక సినిమా రిలీజ్‌ డేట్‌ని మారడం బ్యాడ్‌సెంటిమెంటే అయినా అది నిఖిల్‌కి కలిసి వచ్చింది. ఆయన కెరీర్‌లో పెద్ద హిట్‌ అయిన ‘కార్తికేయ’ ఇలా ఎన్నో రిలీజ్‌ డేట్స్‌ని మార్చుకుని చివరకు ఘనవిజయం సాధించింది. ఇక నిఖిల్‌ కెరీర్‌లో అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ కూడా పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు తప్పనిసరి పరిస్థితుల్లో పెద్దనోట్ల రద్దు సమయంలో విడుదలై కనీవినీ ఎరుగని విజయం సాధించింది. ఆ లెక్కన రిలీజ్‌ వాయిదా పడటం అనే బ్యాడ్‌సెంటిమెంట్‌ని నిఖిల్‌ మరోసారి బ్రేక్‌ చేస్తాడేమో చూద్దాం! 

Again Young Hero Film Postponed:

Nikhil Arjun Suravaram Movie Release Postponed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs