యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదు. ఈ సినిమా కూడా కచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలని హీరో విజయ్ ఎక్కడా రాజి పడడంలేదట. ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి పబ్లిసిటీ విషయంలో కూడా విజయ్ ఫైనల్ డెసిషన్ తరువాతే పనులు జరుగుతున్నాయని తెలిసింది.
దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా విడుదల వాయిదా పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కారణం షూట్ రష్ చూసిన విజయ్ దేవరకొండ అది నచ్చకపోవడంతో రీషూట్ చేయాల్సిందిగా దర్శకనిర్మాతలకు సూచించాడని చెబుతున్నారు. దీనికి ప్రొడ్యూసర్స్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ డైరెక్టర్ మాత్రం ఒప్పుకోకపోవడంతో షూటింగ్ బ్రేక్ ఇచ్చారట. ఈలోపు విజయ్ తన నెక్స్ట్ చిత్రం చేయడానికి రెడీ అయ్యాడని సమాచారం.
అయితే మైత్రీ మూవీ మేకర్స్ ఆ దర్శకుడుని ఒప్పించి మళ్లీ దాదాపు 45 రోజులు ఈ సినిమాను రీషూట్ చేయించారట. అయినా కానీ విజయ్ హ్యాపీగా లేడట. ఐతే ప్రస్తుతం ఎడిటింగ్ స్టార్ట్ చేసి ఆ తరువాత ఏమన్నా ప్యాచ్ వర్క్స్ ఉంటే ఆ సన్నివేశాలు వరకు మరో షెడ్యూల్ షూటింగ్ పెట్టుకుందామనే నిర్ణయానికి ‘డియర్ కామ్రేడ్’ టీమ్ వచ్చిందని సమాచారం. ఇక మే 1న స్పెషల్ సర్‌ప్రైజ్‌ను విజయ్ దేవరకొండ ప్లాన్ చేస్తునట్టు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.