Advertisement
Google Ads BL

అనుపమా పరమేశ్వరన్ వల్లే సాధ్యం: గాయకుడు


గాయకుడు యాజిన్ నిజార్ పేరు, అతను పాడిన పాటలు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ‘శీతాకాలం సూర్యుడిలా...’, ‘లోఫర్’ లో ‘జియా జలే జలే’, ‘కుమారి 21ఎఫ్’ లో ‘మేఘాలు లేకున్నా...’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’లో ‘చిరునామా తన చిరునామా’, ‘వున్నది ఒకటే జిందగీ’లో ‘లైఫ్ ఈజ్ ఏ రెయిన్ బో’, ‘భరత్ అనే నేను’లో ‘ఓ వసుమతి ఓ వసుమతి’, ‘118’లో ‘చందమామే’, ‘బాహుబలి’లో ‘బలి బలి రా బలి’ వంటి హిట్ పాటలను పాడినది ఇతనే. మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ, నందమూరి కల్యాణ్ రామ్ వంటి స్టార్ హీరోలకు, రామ్, వరుణ్ తేజ్, నిఖిల్, రాజ్ తరుణ్ వంటి యువ హీరోలకు పాటలు పాడారు. మలయాళ, తమిళ సినిమాల్లో పలు పాటలు పాడిన యాజిన్ నిజార్ తాజాగా ‘చెలియా ఉంటానే’ అని ఓ మ్యూజిక్ సింగిల్ చేశారు.

Advertisement
CJ Advs

యాజిన్ నిజార్ పాడిన, నటించిన మ్యూజిక్ వీడియో ‘చెలియా ఉంటానే’. నీరో సంగీతం అందించారు. అనుపమా పరమేశ్వరన్ తొలిసారి నటించిన మ్యూజిక్ వీడియో ఇదే. ఆదిత్య మ్యూజిక్ ఒరిజినల్స్  ద్వారా తెలుగు, తమిళ భాషల్లో ఈ పాట విడుదలైంది. తెలుగు వెర్షన్ ‘చెలియా ఉంటానే’కి మౌనిక సాహిత్యం అందించగా... తమిళ్ వెర్షన్ ‘ఉయిరే ఉన్నోడు’కు నీరో సాహిత్యం అందించారు. ఇంగ్లీష్ లిరిక్స్ రాసినది, పాడినది అలెన్ బాబు డేనియల్.

-ఇంతకు ముందు నేను ఒక మ్యూజిక్ సింగల్ ‘నీవే’ చేశా. అందులో నేను నటించలేదు. కానీ, పాడింది నేనే. అదీ, ఇప్పుడీ ‘చెలియా ఉంటానే’... రెండు పాటలు తెలుగు, తమిళ భాషల్లో చేశాం. 

- ‘చెలియా ఉంటానే’కి వస్తే... ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు వచ్చిన ఒక ఐడియా. మ్యూజిక్ డైరెక్టర్ నీరో, నేను ఒక జామ్ సెషన్ లో కలిసినప్పుడు ఈ సాంగ్ ఐడియా స్టార్ట్ అయ్యింది. తరవాత నీరో ఫ్రెండ్ అలెన్ బాబు డేనియల్ మాతో జాయిన్ అయ్యారు. అప్పుడు మ్యూజిక్ వీడియో చేద్దామనే ఐడియా లేదు. యాక్చువల్లీ... అనుపమా పరమేశ్వరన్ కూడా చాలా సపోర్ట్ చేసింది. తనకు పాట నచ్చింది. మ్యూజిక్ వీడియోలో నటిస్తానని చెప్పింది. మేమంతా స‌ర్‌ప్రైజ్ అయ్యాం. చాలా సంతోషించాం. అప్పుడు మ్యూజిక్ వీడియో ఎందుకు చేయకూడదని ఒక ఐడియా వచ్చింది. తన బిజీ షెడ్యూల్ లోనూ అనుపమా పరమేశ్వరన్ మాకు డేట్స్ ఇచ్చి షూటింగ్ చేసింది. మా టీమ్ అందరి సపోర్ట్, ఆదిత్య మ్యూజిక్ సపోర్ట్ తో ఇది సాధ్యమైంది.

-నాకు ఇండస్ట్రీలో ఎక్కువ మంది స్నేహితులు లేరు. ఉన్నవాళ్లలో అనుపమా పరమేశ్వరన్ ఒకరు. తను పాట విని చేస్తానని అనడంతో మేమంతా ఎగ్జయిట్ అయ్యాం. ఇప్పటివరకూ అనుపమ సినిమాల్లో మాత్రమే నటించింది. మ్యూజిక్ వీడియో చేయడమిదే తొలిసారి. తనకు చాలా చాలా థాంక్స్. రెండు రోజుల్లో ఈ పాట షూటింగ్ పూర్తి చేశాం. చిక్ మంగళూర్, తెలంగాణలో కొన్ని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించాం. ఇదొక సింపుల్ లవ్ సాంగ్. ఇద్దరు ఒక ప్రయాణంలో కలుస్తారు. 

-నేను కెమెరా ముందుకొచ్చిన తొలి తెలుగు పాట ఇది. తొలిసారి తెలుగులో నటించా. ఇంతకు ముందు మలయాళ సినిమా ‘యాంగ్రీ బేబీస్’ లో నేను పాడిన పాటలో కనిపించాను. నాలో యాక్టింగ్ టాలెంట్ లేదు. నేను కొంచెం కెమెరా షై. దాంతో టెన్షన్ పడ్డాను. ఇదొక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్.

- ఆదిత్య మ్యూజిక్ వంటి గొప్ప సంస్థ సినిమాలతో పాటు మ్యూజిక్ ఆర్టిస్ట్స్, వీడియోలను సపోర్ట్ చేయడం ఒక పాజిటివ్ సైన్. ఆదిత్య మ్యూజిక్ సపోర్ట్ తో మరింతమంది ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తారని ఆశిస్తున్నా. తెలుగులో నేను పాడిన పాటల్లో ఎక్కువ హిట్ సాంగ్స్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. ఈ సంస్థతో నాకు మంచి అనుబంధం ఉంది. 

-తెలుగులో త్వరలో విడుదల కానున్న ‘మహర్షి’లో ‘నువ్వే సమస్తం’ పాట పాడాను. మహేష్ బాబు గారికి నేను పాట పాడటం ఇది మూడోసారి. ఇంతకు ముందు ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాల్లో పాటలు పాడాను. మహేష్ సార్, దేవిశ్రీ ప్రసాద్ సార్ కాంబినేషన్లో మూడోసారి అవకాశం రావడం సంతోషంగా ఉంది. అలాగే, ఇటీవల విడుదలైన ‘మజిలీ’లో ‘నా గుండెల్లో’, ‘118’లో ‘చందమామే’, ‘అంతరిక్షం’లో ‘సమయమే’ పాటలు పాడాను. గాయకుడిగా నా ప్రయాణం బావుంది. త్వరలో ‘మహర్షి’ విడుదలవుతుంది కనుక ఎగ్జయిటెడ్ గా ఉన్నాను.

Singer Yazin Nizar Interview:

‘Cheliya Untane’ was Possible only Because of Anupama Parameswaran: Singer Yazin Nizar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs