Advertisement
Google Ads BL

బండ్లగణేష్.. ‘సిల్లీ ఫెలో’?


బండ్లగణేష్‌.. ఈయన కెరీర్‌ ప్రారంభంలో చిన్న చిన్న కామెడీ వేషాలు వేసేవాడు. ఎక్కువగా ఎస్వీకృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాల ద్వారా గుర్తింపు వచ్చింది. హీరోగా అడల్ట్‌ కంటెంట్‌తో వచ్చిన ‘ప్లీజ్‌ ఆంటీ’ అనే చిత్రంలో యాక్ట్‌ చేశాడు. కానీ కొంతకాలం కనిపించకుండా పోయి భారీ నిర్మాతగా రీఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో ఆయనకి నాడు మంత్రిగా ఓ వెలుగు వెలుగుతున్న బొత్స సత్యనారాయణ బినామీ అని పేరుండేది. దానిని ఆయన పలుసార్లు ఇన్‌డైరెక్ట్‌గా ఒప్పుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం అదేమీ లేదు. పౌల్ట్రీ పరిశ్రమలో తాను సంపాదించిన మొత్తంతోనే సినిమాలు తీస్తున్నానని ప్రకటించాడు. వరుసగా హిట్‌ చిత్రాలు తీసి బ్లాక్‌బస్టర్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. 

Advertisement
CJ Advs

ఇటు పవన్‌తో అటు ఎన్టీఆర్‌తో విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన తీసిన చిత్రాలు బాగా ఆడలేదు. దాంతో మరలా కనుమరుగై రాజకీయ నాయకునిగా, తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ నేతగా ఎంట్రీ ఇచ్చి ఎలక్షన్లు జరగకుండానే టీవీ ఇంటర్వ్యూలలో ‘గణేష్‌ అనే నేను’ అంటూ ప్రమాణ స్వీకారం చేశాడు. ఇప్పుడు రాజకీయాలు కూడా తన వంటికి పడవని చెప్పి తప్పుకున్నాడు. త్వరలో ఈయన మరోసారి కమెడియన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. ఇప్పటికే సునీల్‌ మరలా కమెడియన్‌గా మారాడు. ఇక రాబోయేది బండ్లగణేష్‌ మాత్రమే. మహేష్‌బాబు 26వ చిత్రంగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు, అనిల్‌ సుంకరలు సంయుక్తంగా నిర్మించే చిత్రంలో బండ్ల మంచి కామెడీ పాత్రను చేయనున్నాడని సమాచారం. 

కామెడీని పండించడంలో, ఆర్టిస్టుల టాలెంట్‌ని చక్కగా వాడుకోవడంలో అనిల్‌ రావిపూడికి మంచి పేరుంది. ఈ చిత్రంలో కోటీశ్వరుడైన తిక్కలోడి పాత్రను బండ్ల చేయనున్నాడట. అంటే దాదాపు నిజజీవితంలోలానే కోటీశ్వరుడైన సిల్లీ ఫెలోగా ఆయన పాత్ర ఉండనుంది. ఈ చిత్రంతో కమెడియన్‌గా మరలా బిజీ అవుతాననే నమ్మకం బండ్లలో ఉందని, అంత బాగా ఇందులోని పాత్రను అనిల్‌ రావిపూడి మలిచాడని సమాచారం. ఇప్పటికే యంగ్‌ కమెడియన్లు జబర్ధస్త్‌ నుంచి వెల్లువలా వస్తున్న తరుణంలో ఆ పోటీని బండ్ల ఎంత వరకు తట్టుకుంటాడో వేచిచూడాల్సివుంది. 

Bandla Ganesh Re Enters :

Bandla Ganesh in Anil Ravipudi and Mahesh Babu Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs