‘జెర్సీ’ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న నాని తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు. విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘గ్యాంగ్ లీడర్’ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తరువాత నాని తనకు లైఫ్ ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో జరుపుకుంటున్న ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు కూడా నటించనున్నాడు. ఇక ఈసినిమాను ఆఫిషియల్‌గా ఈనెల 26వ తేదీన లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ వేరే టైటిల్ ఖరారు చేశారని తెలుస్తోంది.
సినిమా ఓపెనింగ్ రోజు ఈ సినిమా టైటిల్‌పై క్లారిటీ రానుంది. అదే రోజు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక అదితీరావు, నివేదా థామస్ హీరోయిన్స్‌గా కనిపించనున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.