Advertisement
Google Ads BL

రౌడీస్టార్‌ సుడి మాములుగా లేదు..!


ఈ మద్యకాలంలో అతి తక్కువ చిత్రాలతోనే రౌడీస్టార్‌గా ఎదిగి సెన్సేషన్స్‌ సృష్టిస్తున్న యంగ్‌ స్టార్‌గా విజయ్‌దేవరకొండని చెప్పాలి. ఆయన నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నుంచి ‘పెళ్లిచూపులు, మహానటి, అర్జున్‌రెడ్డి, గీతాగోవిందం, ట్యాక్సీవాలా’ ఇలా ఆయన ఇమేజ్‌ రోజురోజుకు స్కై లెవల్లో పెరుగుతోంది. ప్రస్తుతం ఆయన మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థలో మరోసారి ‘గీతాగోవిందం’ తర్వాత రష్మికామందన్నతో జోడీ కట్టి ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం టీజర్‌లో విజయ్‌, రష్మికల లిప్‌లాక్‌ సీన్‌ సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతాకాదు. ఈ చిత్రం నుంచే ఆయన నటించిన అన్ని చిత్రాలు తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ.. ఇలా అన్ని దక్షిణాది భాషల్లో విడుదల కానున్నాయి. ఆయన చేతిలో ప్రస్తుతం డజన్‌ స్క్రిప్ట్‌లు రెడీగా ఉన్నాయని సమాచారం. 

Advertisement
CJ Advs

ఇకపోతే విజయ్‌దేవరకొండ తనను ‘పెళ్లిచూపులు’తో హీరోని చేసిన దర్శకుడు తరణ్‌భాస్కర్‌ని నటుడిగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కథ బాగా నచ్చడంతో మొదట్లో సోలో నిర్మాతగా తీయాలని భావించాడు. కానీ హీరోగా తనకి పెరిగిపోతున్న డిమాండ్‌, వరుస చిత్రాల బిజీ షెడ్యూల్‌, ఇమేజ్‌లో అసాంతం ఎంతో మార్పు రావడంతో ఆ చిత్రంలో పెట్టుబడి మాత్రమే పెట్టాడు. ఇక్కడ కూడా విజయ్‌దేవరకొండ లక్కీ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఈరోజుల్లో చిన్న చిత్రాలను నిర్మించడం ఎంత కష్టమో, రిలీజ్‌డేట్‌, సరైన థియేటర్లను ఎంపిక చేసుకుని, అద్భుతంగా ప్రమోషన్స్‌ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం అన్న విషయం తెలిసిందే. అందుకే సినిమా నిర్మాణం పూర్తయ్యే లోపు పలు చిత్రాల నిర్మాతలు మారుతూ వస్తున్నారు. 

తాజా సమాచారం ప్రకారం విజయ్‌ దేవరకొండ పెట్టుబడి పెట్టిన చిత్రాన్ని ఏషియన్‌ సునీల్‌ సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది. విజయ్‌ నాన్న వర్ధన్‌ పేరుతో ఈ చిత్రాన్ని వర్దన్‌దేవరకొండ నిర్మాతగా నిర్మిస్తున్న ఈ చిత్రం డీల్‌ పూర్తయింది. చాలా రీజనబుల్‌ అమౌంట్‌కి ఏషియన్‌ సునీల్‌నారంగ్‌ ఈ చిత్రాన్ని తీసుకోవడంతోనే నిర్మాతగా తన తొలి చిత్రం విడుదల కాకముందే విజయ్‌కి ఈ చిత్రం లాభాలను అందించింది. ఈమేరకు విజయ్‌ నాన్న వర్ధన్‌ తాజాగా సునీల్‌ని కలిసి ఈ సినిమా తాలూకు హక్కులు ఇచ్చి చెక్‌ పొందుతున్న ఫొటో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది. మొత్తానికి ఎంతైనా అదృష్టం పడితే అంతే. దరిద్రం పట్టుకున్నట్లు పట్టుకుంటుంది. ఈ విషయంలో విజయ్‌దేవరకొండనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

Sunil Naarang bagged Vijay Deverakonda Produced Film:

Vijay Deverakonda Lucky Fellow 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs