గతకొంతకాలంగా దేవిశ్రీప్రసాద్‌లో పసతగ్గిందా? ఆయన సంగీతం అందించిన చిత్రాలు పెద్దగా ఎందుకు బ్లాక్‌బస్టర్ కావడం లేదనే చర్చసాగుతోంది. రంగస్థలం తర్వాత ఈయనకు చెప్పుకోదగిన చిత్రం రాలేదు. దాంతో దేవిశ్రీ పని అయిపోయిందని, గుజ్జు మాయం అయిందని సెటైర్లు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన మహేష్‌బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా రూపొందుతోన్న మహర్షి చిత్రం చేస్తున్నాడు. పూజాహెగ్డే, అల్లరినరేష్‌లు కీలకపాత్రలను పోషిస్తున్న ఈ మూవీని దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తూ ఉండటం విశేషం. ఈ మూవీని మే9న విడుదల చేయనున్నారు. దాంతో ఈ చిత్రానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఛోటీ ఛోటీ భాతే, నువ్వే సమస్తం... వంటి సాంగ్‌ని విడుదల చేశారు.
తాజాగా ఇందులోని ‘పదరా..పదరా.. పదరా’ అనే సాంగ్ విడుదల కానుంది. పదరా పదరా పదరా నీ అడుగుకు పదును పెట్టి పదరా.. ఈ అడవిని చదును చెయ్యి... మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా...! అంటూ ఈ పాట సాగింది. శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను బుధవారం సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేస్తామని మహర్షి టీం తెలిపింది. ఈ పాట విడుదలను తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్‌లో కూడా మహేష్‌బాబు ఒక పొలంలో పరుగు పార, నాగిళ్లు చేతపట్టిన రైతులకు ముందు కదం తొక్కుతూ ఉన్నాడు. పైర్ల పచ్చదనానికి సింబల్ అన్నట్లుగా ఆకుపచ్చ రంగు చొక్కా, ప్యాంటుని పైకి మడిచి, తలకు టవల్‌ని తలపాగాలాగా కట్టుకుని మరీ మోడ్రన్ రైతులా ఉన్నాడు.
ఈ సినిమాలో మహేష్ రైతు సమస్యలపై పోరాడుతాడని వార్తలు వచ్చాయి. ఈ పాట సాహిత్యం, స్టిల్‌ని బట్టి చూస్తే అదే నిజమని తెలుస్తోంది. ఇప్పటివరకు విడుదలైన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ఈ తాజా సాంగ్ అయినా ప్రేక్షకులను మెప్పిస్తుందా? దేవిశ్రీప్రసాద్‌పై వస్తున్న విమర్శలకు చెక్‌బెడుతుందా? అనేవి వేచిచూడాలిస్సవుంది....!