తెలుగులో ఉన్న వైవిధ్యభరితమైన హీరోలలో నిఖిల్ ఒకడు. రొటీన్ చిత్రాలను కాకుండా ఆయన వైవిధ్యభరితమైన కథాంశాలకే పెద్దపీట వేస్తాడు. ఆయన కెరీర్ ‘స్వామిరారా’కి ముందు తర్వాత అని విభజించుకోవచ్చు. స్వామి..రా..రా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. కానీ ఆ తర్వాత ఎన్నో అంచనాలతో వైవిధ్యభరితమైన కథతో తీసిన కేశవ, కన్నడ కిర్రాక్‌పార్టీకి రీమేక్‌గా అదే టైటిల్‌తో చేసిన చిత్రాలు పెద్దగా విజయం సాధించలేదు. దాంతో ఎలాగైనా సరే మరలా ట్రాక్‌లోకి రావడానికి ఆయన తనవంతు కృషి చేస్తున్నాడు.
ఇందులో భాగంగా కిర్రాక్‌పార్టీ తర్వాత తమిళ చిత్రం ‘కణితన్’ రీమేక్‌లో నటిస్తున్నాడు. జర్నలిజం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ యాక్షన్ జోనర్ తరహా చిత్రం మే 1న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఠాగూర్ మధు, మెగాస్టార్ చిరంజీవిలు హాజరవుతారని సమాచారం. గతంలో కూడా చిరంజీవి నాగశౌర్య ‘ఛలో’, విజయ్‌దేవరకొండ ‘గీతగోవిందం’తో పాటు శర్వానంద్‌తో పాటు పలువురికి ఇలా సాయం చేసి పెట్టాడు. ఇప్పుడు నిఖిల్‌వంతు వచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ ‘సై..రా’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవల రాఘవలారెన్స్ ‘కాంచన 3’ వేడుకకి చిరుని పిలిచినా పలు కారణాల వల్ల రాలేదు. అయితే ‘ఠాగూర్’ మధుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అయినా కాస్త వెసులుబాటు తీసుకుని ఈ వేడుకకు రావచ్చనే తెలుస్తోంది. మధుని ఇంటిపేరుగా మిగిలిపోయిన ఠాగూర్ చిత్రం అంటే చిరంజీవికి అమిత ఇష్టం. అందుకే ‘అర్జున్‌సురవరం’ వేడుకకు మెగాస్టార్ వచ్చే అవకాశం ఉందనే చెప్పాలి.
మరో ముఖ్యవిషయం ఏమిటంటే.. ఈ ఏడాది సమ్మర్‌కి ఎలాగైనా పెద్దహిట్ సాధించాలని నిఖిల్ పట్టుదలతో ఉన్నాడు. రిలీజ్‌కి పెద్దగా సమయం లేకపోవడంతో ఆయన స్వయంగా సోషల్‌మీడియాలో, ఇతర విధాలుగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో నిఖిల్‌ది మీడియా జర్నలిస్ట్ పాత్ర. అంటే ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఎవరు సెలబ్రిటీలు ఉన్నా కూడా వారిని ఇంటర్వ్యూలు చేసే పాత్ర. అందుకే ఈ చిత్రం టీం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మత ప్రచారకుడు కె.ఏ.పాల్‌ని ఇంటర్వ్యూ చేసి దానిని ప్రమోషన్స్ కోసం వాడుకోవాలని చూస్తున్నారు. కానీ ప్రస్తుతం పాల్ అమెరికాలో ఉన్నాడట. విచిత్ర హావభావాలు, మాటలతో నవ్వు తెప్పించే పాల్‌తో నిఖిల్ రియల్ ఇంటర్వ్యూ అంటే అది చిత్ర ప్రమోషన్స్‌కి బాగా ఉపయోగపడుతుందనే చెప్పాలి.