Advertisement
Google Ads BL

వరుణ్ ‘వాల్మీకి’కి ‘ముకుంద’ లింక్!


ఈమధ్యన పూజ హెగ్డే యవ్వారం మాములుగా లేదు. టాలీవుడ్, బాలీవుడ్ కలిపి చుట్టేస్తున్న ఈ భామ టాలీవుడ్ లో ఏకంగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ హాట్ హాట్ గా టాప్ చైర్ ఎక్కడానికి రెడీ అయ్యింది. హరీష్ శంకర్ డీజే సినిమాలో పూజ హెగ్డే ని చూపించిన విధానానికి, ఆమె గ్లామర్ కి స్టార్ హీరోలే పడిపోయారంటే.. పూజ లక్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధమవుతుంది. మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్..తాజాగా అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమాలో పూజ నే హీరోయిన్ అంటూ వార్తలొస్తున్న వేళ. ఇప్పుడు మరో మెగా హీరో కోసం పూజ హెగ్డే రంగంలోకి దిగుతుందనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.

Advertisement
CJ Advs

హరీష్ శంకర్ - వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న వాల్మీకి చిత్రంలో పూజ హెగ్డే నటించబోతుంది. వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్లో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుణ్ తేజ్ గెడ్డం లుక్ అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ వాల్మీకి సినిమాలో ఓ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో వరుణ్ తేజ్ లవర్ గా పూజా హెగ్డే కనిపించబోతోందనేది తాజా సమాచారం. ఇప్పటికే వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్స్ అనగానే సినిమా మీద ఆటోమాటిక్ గా హైప్ పెరిగితే.. ఇప్పుడు పూజ హెగ్డే క్రేజ్ కూడా సినిమా మీద హైప్ పెరగడానికి కారణమయ్యింది. మరి డీజే తో పూజ లక్కుని మార్చేసిన హరీష్ శంకర్ అడిగాడనే పూజ అంత బిజీ షెడ్యూల్ లోను వరుణ్ కి లవర్ గా నటించడానికి ఒప్పుకుందని టాక్ అయితే సోషల్ మీడియాలో వినబడుతుంది. 

Mukunda Heroine in Valmiki Movie:

Pooja Hegde in Varun Tej Valmiki
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs