నాని జెర్సీ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం మూడు రోజుల్లోనే 10 కోట్లకి పైనే కొల్లగొట్టిన నాని జెర్సీ మూవీ ఈ వారం ముగిసేసరికి నిర్మాతలకు లాభాలు బాట పట్టించేలా కనబడుతుంది. నాని నటనకు, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ కు ఇండస్ట్రీలోని అతిరధ మహారధులు ఫ్లాట్ అయ్యారు. అందుకే వీకెండ్ లోనే కాదు.. సోమవారం మొదలైన జెర్సీ మూవీకి బుకింగ్స్ బావున్నాయి. ఇక రాఘవ కాంచన 3 మూవీతో జెర్సీకి పోటీకి దిగకపోయుంటే గనక.. జెర్సీ ఈపాటికే 15 కోట్లు కొల్లగొట్టేది. రాఘవ క్రేజ్ తో కాంచన 3 కి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ.. కాంచన 3 కలెక్షన్స్ మాత్రం కుమ్మేస్తున్నాయి. అలా జెర్సీని, కాంచన 3 దెబ్బకొట్టింది. కాంచన 3 నెగెటివ్ టాక్ తో జెర్సీకి గట్టి పోటీ ఇస్తుంది.
ఇక జెర్సీ గనక మరో వారం థియేటర్స్ లో ఉంటే.. ఆ సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చేవి. ఎందుకంటే జెర్సీ సినిమా కేవలం మల్టిప్లెక్స్ ఆడియన్స్ కి మాత్రమే కావడంతో బిసి సెంటర్ ఆడియన్స్ అంతా కాంచన 3 కి కనెక్ట్ అయ్యారు. ఇక మల్టిప్లెక్స్ లో అయినా జెర్సీకి మరో వారం లైన్ క్లియర్ అయితే బావుండేది కానీ.. ఇప్పుడు జెర్సీకి అవెంజర్స్ ఎండ్ గేమ్ పెద్ద గండంలా తయారైంది. హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ రేపు శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక మల్టిప్లెక్స్ లలో అవెంజర్స్ ఎండ్ గేమ్ టికెట్స్ బుకింగ్స్ అలా ఓపెన్ అవుతున్నాయో లేదో ఇలా బుక్ అవుతున్నాయి. అవెంజర్స్ ఎండ్ గేమ్ టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడవడం చూస్తుంటే..... జెర్సీ కలెక్షన్స్ కి బాగా దెబ్బపడేలా కనబడుతుంది.
అవెంజర్స్ ఎండ్ గేమ్ మీద ఎంత క్రేజుందో.... బుక్ మై షో టికెట్స్ చూస్తేనే తెలుస్తుంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ టికెట్స్ శుక్ర, శని, ఆదివారాల్లో ఫుల్ బుకింగ్స్ తో బుక్ మై షో కళకళలాడుతుంది. మరి అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇప్పుడు జెర్సీకి గండంగా మారింది. లేదంటే జెర్సీకొచ్చిన బ్లాక్ బస్టర్ టాక్ తో నిర్మాతలు ఎలా లేదన్న భారీగా లాభాలు వెనకేసుకునే వారు.