Advertisement
Google Ads BL

‘జెర్సీ’ దర్శకుడు.. నెక్స్ట్ ఆ స్టార్ హీరోతోనా?


ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం జెర్సీ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. నాని యాక్టింగ్ గురించి వేరే చెప్పనవసరం లేదు అంటున్నారు. ఇక ముఖ్యంగా ఈసినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. తన రెండో సినిమాకే ఇంతలా క్రేజ్ తెచ్చుకోవడం అంటే మాములు విషయం కాదు. పైగా అతనికి ఇద్దరి స్టార్ హీరోస్ నుండి కాంప్లిమెంట్లు వచ్చింది. ఇంతకంటే ఒక దర్శకుడికి ఏం కావాలి? అంటూ ఎగ్జయిట్ అయ్యారు గౌతమ్. ఆ కాంప్లిమెంట్లు ఇచ్చింది ఎవరో కాదు ఒకరు తారక్ అండ్ ఇంకొకరు బన్నీ.

Advertisement
CJ Advs

తారక్ టాలీవుడ్ నుండి ఏ మంచి మూవీ వచ్చిన కాంప్లిమెంట్లు ఇవ్వడంలో ముందు ఉంటాడు. అదే విధంగా జెర్సీ కూడా ఇచ్చాడు అనుకున్నారంతా. కానీ ఇక్కడ విషయం అది కాదు. తారక్ కి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి ఆల్రెడీ పరిచయం ఉందట. ఈ డైరెక్టర్ తారక్ కి జెర్సీ రిలీజ్ కంటే ముందే కథ చెప్పారట. గౌతమ్ సెన్సిబిలిటీస్ నచ్చాయని తారక్ ప్రశంసలు కురిపించారని తెలిసింది. ప్రస్తుతం దీని గురించి మీడియా లో చర్చలు సాగుతున్నాయి. అందుకే తారక్ సినిమా గురించి పోస్ట్ చేసాడని అంటున్నారు.

మరి సినిమా బ్లాక్ బస్టర్ అయింది.. మరి తారక్ ఛాన్సిస్తారా? అంటే గౌతమ్ తిన్ననూరి బౌండ్ స్క్రిప్ట్ దానిని డిసైడ్ చేస్తుందని మాట్లాడుకుంటున్నారు. ఈమధ్య మన హీరోస్ అంత ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే కథను ఓకే చేస్తున్నారు లేకపోతే లేదు. ఒకవేళ గౌతమ్ ఫుల్ స్క్రిప్ట్ తో తారక్ ను ఇంప్రెస్స్ చేస్తే తారక్ అతనితో సినిమా చేసే అవకాశముంది. తారక్ లిస్ట్ లో RRR తరువాత ఎంతమంది డైరెక్టర్స్ ఉన్న యూనిక్ స్టోరీని సెలక్ట్ చేసుకుంటే గౌతమ్ కే ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుంది. అలానే బన్నీ కూడా. కాకపోతే బన్నీ ప్రస్తుతం మూడు సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. ఆ మూడు సినిమాలు తరువాత గౌతమ్ చెప్పిన కథ నచ్చితే అప్పుడు చేస్తాడు. అప్పుటి వరకు కష్టమే. అయితే గౌతమ్ తన నెక్స్ట్ మూవీ ఎవరితో అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం అతను సక్సెస్ ను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు.

Gautham Thinnanuri next Film with Star hero:

Jr NTR Happy with Gautham Thinnanuri Work
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs