Advertisement
Google Ads BL

త్రివిక్రమ్‌ను మాములుగా లేపడంలా..!


త్రివిక్రమ్, సునీల్ ఇద్దరూ మంచి స్నేహితులు. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో కెరీర్ లో స్థిరపడకముందు ఇద్దరూ కలిసి ఒకే రూమ్ లో ఉండేవారు. ప్రస్తుతం ఒకరు నటుడుగా, ఒకరు డైరెక్టర్ గా సత్తా చాటుతున్నారు. ఇక త్రివిక్రమ్ సినిమాలో సునీల్ కి మంచి క్యారెక్టర్స్ ఉండేవి కమెడియన్ గా. కానీ సునీల్ హీరో గా ప్లాప్ అయ్యాక.. ఎక్కడ తిరిగినా నా ఫ్రెండ్ నాకు ఏదో ఒక క్యారెక్టర్ ఇస్తాడనే నమ్మకం నాకుంది అని సునీల్ చెప్పినట్టుగానే... హీరోగా ఫెయిల్ అయ్యాక సునీల్, త్రివిక్రమ్ అరవింద సమేతలో ఒక మంచి క్యారెక్టర్ చేసాడు. 

Advertisement
CJ Advs

తాజాగా అల్లు అర్జున్ తో, త్రివిక్రమ్ చెయ్యబోయే సినిమాలోనూ సునీల్ కి త్రివిక్రమ్ మంచి క్యారెక్టర్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతుంది. మరి అంత ఆదుకుంటున్న తన ఫ్రెండ్ ని సునీల్ మునగ చెట్టు ఎక్కించేస్తున్నాడు. చిత్రలహరి విజయంతో కాస్త కోలుకున్న సునీల్ ఒక ఇంటర్వ్యూ లో త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ.. తాము రూంలో కలిసి ఉండేటప్పుడు త్రివిక్రమ్ చాలా కథలను రాసుకున్నాడని.. అందులో త్రివిక్రమ్ కనీసం సగం కూడా వాడలేదని చెబుతున్నాడు. తనకి త్రివిక్రమ్ కథలను వినిపించేవాడిని చెప్పిన సునీల్.. ఆ కథల్లో  500 కోట్ల బడ్జెట్ ఉన్న కథ కూడా ఉందట. 

అప్పట్లో 500 కోట్ల బడ్జెట్ కి ఆ కథ రాసిన.. త్రివిక్రమ్ ఇప్పుడు గనక అదే కథతో సినిమా తియ్యాల్సి వస్తే... 2000 కోట్ల బడ్జెట్ పెట్టాల్సి వస్తుందని.. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎవరు అందనంత ఎత్తుకు ఎదుగుతాడని అనుకున్నానని.. ఇప్పుడున్న పొజిషన్ కన్నాఎక్కువ ఎత్తుకు ఎదుగుతాడని అనుకున్నానని.. అంతెందుకు.. దర్శకుడిగా మారక రెండు మూడు సినిమాలకే బాలీవుడ్ కి వెళ్లిపోయే టాలెంట్ త్రివిక్రమ్ కి ఉందని.. స్నేహితుణ్ని చెట్టెక్కించేస్తున్నాడు సునీల్.

Sunil Praises His Friend Trivikram Srinivas:

Sunil Talks About Trivikram Srinivas Greatness
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs