ఈ సమ్మర్ లో ఎలక్షన్స్ హడావుడితో పాటు ఐపీల్ సీజన్ కూడా నడుస్తుండంతో మన టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఈ ఏప్రిల్ లో సినిమాలు రిలీజ్ చేయడానికి జంకారు. కానీ కథలు మీద ఉన్న కాంఫిడెన్స్ తో ఎవరూ వెనక్కి తగ్గలేదు. పైగా బాక్స్ ఆఫీస్ తో పాటు ముగ్గురు హీరోస్ కు హిట్ అనేది చాలా అవసరం. ఆ పరిస్థితుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి ఆ ముగ్గురు హీరోల సినిమాలు వచ్చాయి.
ఏప్రిల్ మొదటి వారంలో నాగ చైతన్య మజిలీ వచ్చింది. చైతు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈచిత్రం నిలిచింది. చైతు హిట్ చూసి చాలా ఏళ్ళు అవుతుండంతో ఈ హిట్ తో అక్కినేని అభిమానులను సంబరాల్లో ముంచెత్తాడు. ఆ నెక్స్ట్ వారం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయిన తరువాత రోజు సాయి ధరమ్ తేజ్ చిత్రలహరితో వచ్చాడు. ఈ సినిమాకి ముందు తేజుకి వరసగా 6 ప్లాప్స్ వచ్చాయి. ఈ సినిమాతో సేఫ్ అయ్యాడు. చాలా ఏరియాస్ లో చిత్రలహరి బ్రేక్ ఈవెన్ అయింది. మిగిలిన ఏరియాస్ లో కూడా త్వరలోనే అవ్వనుంది.
ఇక నిన్న నాని జెర్సీ సినిమాతో వచ్చి అందరిని ఎమోషన్ లతో కట్టిపడేసాడు. మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ తో ఈ సినిమా దూసుకుపోతుంది. 2019 మన బాక్స్ ఆఫీస్ కి భలే కలిసొచ్చిందని చెప్పాలి. 2019 స్టార్టింగ్ లో ఎఫ్ 2 చిత్రం తరువాత ఏప్రిల్ లో వచ్చిన మూడు సినిమాలు హిట్ అవ్వడం విశేషం. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఈ మూడు సినిమాలు ఎమోషనల్ గా సాగుతూ.. ఆయా హీరోలకు ఎమోషనల్ హిట్స్ ఇవ్వడం విశేషమే.