నిన్న శుక్రవారం విడుదలైన జెర్సీ సినిమా సూపర్ ఓపెనింగ్స్ తో... అదరగొట్టే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. నాని - గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కిన జెర్సీ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈమధ్యన థియేటర్లలో మంచి సినిమాలు లేక అల్లాడుతున్న సినీ ప్రియులకు.. నాగ చైతన్య - సమంత జంటగా నటించిన మజిలీ సినిమా ఊరటనిచ్చింది. ఏప్రిల్ ఐదున విడుదలైన మజిలీ సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోయుంది. నిన్నమొన్నటి వరకు మజిలీ బుకింగ్స్ బావున్నాయి. కానీ జెర్సీ దెబ్బకి మజిలీ సినిమా ఇప్పుడు కామ్ అయ్యి.. ఫైనల్ రన్ కి దగ్గరైంది.
ఇక గత శుక్రవారం డబుల్ హ్యాట్రిక్ ప్లాప్స్ తో చాలా నిరాశతో బరిలోకి దిగిన సాయి ధరమ్ తేజ్ చిత్రలహరికి యావరేజ్ టాక్ పడింది. సాయి ధరమ్ తేజ్ తన పేరుని సాయి తేజ్ గా ఈ సినిమాతో మార్చుకున్నాడు. మరి పేరు మార్చిన టైం బాగా కలిసొచ్చినట్టుగా వుంది. అందుకే ఆరు ప్లాప్స్ తర్వాత చిత్రలహరికి యావరేజ్ హిట్ వచ్చినా.. తెగ ఆనంద పడిపోతున్నాడు తేజ్. కిషోర్ తిరుమల - సాయి తేజ్ కాంబోలో వచ్చిన చిత్రలహరి కూడా మంచి కలెక్షన్స్ తో ఆ వీక్ మొత్తం బాగానే కొల్లగొట్టింది. కానీ ఇప్పుడు చిత్రలహరి యావరేజ్ టాక్ కి జెర్సీ అడ్డం పడింది. జెర్సీ సూపర్ హిట్ కావడంతో.. అటు మజిలీ, ఇటు చిత్రలహరి సినిమాలు రెండు సర్దుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది.