Advertisement
Google Ads BL

ఈ రేంజ్ హిట్టు అనుకోలేదు: ‘జెర్సీ’ దర్శకుడు


‘జెర్సీ’ స‌క్సెస్‌ను ఇంత పెద్ద రేంజ్‌లో ఊహించ‌లేదు - ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి

Advertisement
CJ Advs

నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా, రోనిత్ క‌మ్ర‌, స‌త్య‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన చిత్రం ‘జెర్సీ’. ఏప్రిల్ 19న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్‌హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఇంట‌ర్వ్యూ..

‘జెర్సీ’ ఇన్‌స్పిరేష‌న్ ఎక్క‌డి నుండి వ‌చ్చింది?

- నిజానికి ముందు నేను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాల‌ని అనుకోలేదు. హైద‌రాబాద్‌లో ఓ ప్రెస్‌మీట్‌లో హ‌ర్ష బోగ్లే మాట్లాడుతూ స‌చిన్ టెండూల్క‌ర్ ఎంత గొప్పోడో ఆరోజు చెప్పారు. స‌చిన్ అంత గొప్ప ఆట‌గాళ్లు చాలా మంది ఉన్నా కూడా.. యాటిట్యూడ్ కార‌ణంగానే స‌చిన్ గొప్ప‌వాడైయ్యాడ‌ని.. హర్ష బోగ్లే చెప్పుకొచ్చారు. నాకు స‌చిన్ టెండూల్క‌ర్ గొప్ప‌త‌నం క‌న్నా.. ఆయ‌న‌లా టాలెంట్ ఉన్నోళ్లు చాలా మంది ఉన్నారు క‌దా! అనే పాయింట్ బాగా న‌చ్చింది. సాధార‌ణంగా మ‌నం స‌క్సెస్ అయినోళ్ల‌నే గుర్తుపెట్టుకుంటాం. కానీ అంతే క‌ష్ట‌ప‌డి వేర్వేరు కార‌ణాల‌తో ల‌క్ష్యాన్ని చేరుకోని వాళ్లు చాలా మంది ఉంటారు. వాళ్ల క‌థ చెప్పాల‌నుకున్న సంద‌ర్భంలో జెర్సీ క‌థ‌ను త‌యారు చేసుకున్నాను. 

రామ‌న్ లాంబా ఇన్‌స్పిరేష‌న్‌తో ఈ క‌థ‌ను త‌యారు చేసుకున్నార‌ని వార్త‌లు వినిపించాయి?

- లేదండి.. క్రికెట్ ఆడుతూ రామ‌న్ లాంబా గాయ‌ప‌డి చ‌నిపోయారు. అయితే సినిమా చూసిన వారికి రామ‌న్ లాంబా క‌థ‌కు, నా సినిమాకు లింక్ లేద‌ని అర్థ‌మ‌వుతుంది. 

క‌థ ప‌రంగా ఎలాంటి రీసెర్చ్ చేశారు?

- రీసెర్చ్ అంటూ ప్ర‌త్యేకంగా ఏమీ చేయ‌లేదు. చిన్న‌ప్ప‌ట్నుంచి క్రికెట్ ఆడుతున్నాం క‌దా.. దాన్ని దృష్టిలో పెట్టుకునే క‌థ‌ను రాసుకున్నాను. క‌థ‌పై ఎక్కువ రోజులు వ‌ర్క్ చేశాను. నా తొలి చిత్రం ‘మ‌ళ్ళీరావా’ కంటే ముందు నుండే నా ద‌గ్గ‌రున్న స్టోరి. 

సినిమాకు ఇంత పెద్ద రెస్పాన్స్ వ‌స్తుంద‌నుకున్నారా?

- లేదండి.. ఇంత మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని అనుకోలేదు. ఎందుకంటే సినిమా అంటే ఓ బాధ్య‌త‌. ముఖ్యంగా ద‌ర్శ‌కుడ్ని న‌మ్మే నిర్మాత డ‌బ్బులు పెడ‌తాడు. మొన్న‌టి వ‌ర‌కు నాకు కూడా అరే ఇంత మంది నన్ను న‌మ్మారే ఏమ‌వుతుందో ఏమో అనే టెన్ష‌న్ ఉండేది. ఇప్పుడు సినిమాకు హిట్ టాక్ వ‌చ్చి అంద‌రూ ఎంజాయ్ చేస్తున్నా స‌రే!  నేను ఎంజాయ్ చేయ‌డానికి నాకు ఇంకా స‌మ‌యం ప‌ట్టేలానే ఉంది. నా ద‌గ్గ‌రున్న స్క్రిప్ట్స్‌లో నాకు ఇదే ఇష్ట‌మైన స్క్రిప్ట్‌. క‌థ రాసుకున్న త‌ర్వాత రెండు, మూడేళ్లు నా ద‌గ్గ‌రే ఉంది. ఆ ప‌రిస్థితుల్లో ఎవ‌రూ నాతో ఇలాంటి సినిమా చేయ‌ర‌ని ఎవ‌రినీ అప్రోచ్ కాలేదు. 

ఈ చిత్రం ద్వారా ఏం చెప్పాల‌నుకున్నారు?

- ఓ అండ‌ర్‌డాగ్ స్టోరి. ప్ర‌పంచ‌మంతా ఇత‌నేం చేయ‌లేడు అని అంద‌రూ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన ఓ వ్య‌క్తి.. అత‌ను ఎలాంటి ప్ర‌య‌త్నం చేశాడు?  దాన్ని సాధించ‌డానికి అత‌ను ఎంత వ‌ర‌కు ముందుకెళ్లాడ‌నేదే క‌థ‌. 

నాని కాన్ఫిడెన్స్ లెవ‌ల్ ఎలా ఉండేది?

- నానిగారి కాన్ఫిడెన్స్ చూసి చాలా సంద‌ర్భాల్లో భ‌య‌మేసింది. ఎందుకంటే నేను ఓ మంచి సినిమా చేయాల‌నే త‌ప‌న‌తో ఈ సినిమా చేస్తూ వ‌చ్చాను. ఔట్‌పుట్‌ను డ‌బ్బింగ్ థియేట‌ర్‌లో చూసుకున్న త‌ర్వాత ఇది మ‌నం చేసిన సినిమాయేనా అనిపించింది. 

క్రికెట్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం ఏం చేశారు?

నాని, విశ్వాంత్ త‌ప్ప‌.. ఈ సినిమాలో మిగిలిన వాళ్లంద‌రూ క్రికెట‌ర్సే. క్రికెట‌ర్స్ అంద‌రికీ యాక్టింగ్‌లో కొన్ని రోజులు శిక్ష‌ణ ఇచ్చాం. స్పోర్ట్స్‌ను అథేంటిక్‌గా చూపించాలి. క్రికెట్ స‌న్నివేశాల‌ను షూట్ చేయ‌డం చాలా క‌ష్టమైంది. సాధార‌ణ సీన్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసేయొచ్చు. అదే క్రికెట్‌లో 1 మినిట్ ఏపిసోడ్‌ను ఒక‌టిన్నర రోజు షూట్ చేసిన సంద‌ర్భం కూడా ఉంది. ఒక కెమెరాతో మూమెంట్స్ క్యాప్చ‌ర్ చేయ‌డం క‌ష్టం. అందుక‌నే ఓ సైడ్ క్రికెట్ గేమ్‌ను కొన్ని రోజుల్లో చిత్రీక‌రించాం.. మ‌రో ప‌క్క స‌న్నివేశాల‌ను మ‌రికొన్ని రోజుల్లో చిత్రీక‌రించాం. 

బాలీవుడ్‌లో సినిమాలు చేస్తారా?

నాకు బాలీవుడ్‌లో సినిమాలు చేయాల‌నే ఆలోచన ఇప్ప‌ట్లో లేదు. 

నెక్స్‌ట్ ప్రాజెక్ట్స్‌

- ముందు క‌థ రాసుకున్న త‌ర్వాతే దానికి త‌గ్గ హీరోల‌ను క‌లిసి క‌థ చెబుతాను. ప్ర‌స్తుతం నా ద‌గ్గ‌ర కొన్ని క‌థ‌లున్నాయండీ.. అయితే వెంట‌నే సినిమా స్టార్ట్ చేయ‌ను. కాస్త గ్యాప్ తీసుకుని సినిమా చేస్తాను.

Jersey Director Interview:

Gautham Tinnanuri Talks About Jersey
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs