తెలుగులో శ్రీదేవి తర్వాత ఇంకా చెప్పాలంటే శ్రీదేవిని మించిన రీతిలో లేడీస్టార్ డమ్ సంపాదించుకుని లేడీ అమితాబ్‌గా ఒంటిచేత్తో తన యాక్టింగ్, యాక్షన్ సీన్స్‌తోనే ప్రేక్షకులను మైమరపించిన నటి విజయశాంతి. ఆమె నటించిన ‘కర్తవ్యం, ఆశయం, శత్రువు, సూర్య ఐపిఎస్, పోలీస్‌లాకప్, ప్రతిఘటన, వందేమాతరం, దేశంలో దొంగలు పడ్డారు, నేటి భారతం’ ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. ఇక ఆమె నుంచి వచ్చిన చివరి బ్లాక్‌బస్టర్ ‘ఓసేయ్‌రాములమ్మ’. నాడు ఆమె సీనియర్ స్టార్స్ అయిన కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, విక్టరీ వెంకటేష్.. నుంచి సుమన్, రాజశేఖర్ వరకు అందరితో జత కట్టింది. ఇక ఈమె రాజకీయాలలోకి వెళ్లిపోయి తాను తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అని చెప్పి, తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తూ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలం కేసీఆర్, టైగర్ నరేంద్రలతో పని చేసి, ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీని పెట్టి, బిజెపి, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు మారింది. ప్రస్తుతం ఆమె తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలిగా ఉంది. మధ్యలో సినిమాలు చేయడం మానేసింది. తన చూపు మరలా ఈ దిశగా మార్చలేదు. ఆమె కోరుకుని ఉంటే ఆమెకి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, పవర్‌ఫుల్ పాత్రలు వచ్చి ఉండేవి.
కానీ ఆమె ఈమధ్య మీడియాకి కూడా అందుబాటులో ఉండటం లేదు. మీడియాకు ఇంటర్వ్యూలకి కూడా నో చెబుతోంది. రాహుల్‌గాంధీ కోరిక మేరకు తాను కాంగ్రెస్‌లో ఓ సాధారణ కార్యకర్తగా ఉంటానని చెప్పింది. ఇక ఎప్పటికప్పుడు విజయశాంతి టాలీవుడ్‌లోకి మరలా రీఎంట్రీ ఇస్తోందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా వేణు ఉదుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కలిసి నటిస్తున్న ఓ పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘విరాటపర్వం’ చిత్రంలో కీలకపాత్రను ఇస్తే నో చెప్పిందని, దాంతో ఆ పాత్రకు టబుని తీసుకున్నారని సమాచారం. ఇంతలోనే మహేష్‌బాబు హీరోగా దిల్‌రాజు, అనిల్‌సుంకరల భాగస్వామ్యంలో అనిల్‌రావిపూడి తీసే చిత్రంలో విజయశాంతికి ఎంతో ప్రాధాన్యమైన పాత్ర ఉందని, దానికి ఆమె ఓకే చేసిందని వార్తలు వస్తున్నాయి.
కానీ ఇవి పుకార్లో నిజమో తెలియడం లేదు. ఇక మహేష్‌బాబు బాలనటునిగా ఉన్న సమయంలో ఆమె కృష్ణ సరనస ‘కొడుకు దిద్డిన కాపురం’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం వచ్చి మూడు దశాబ్దాలు అవుతోంది. మరోవైపు మహేష్ పిన్ని విజయనిర్మలకు విజయశాంతి సమీప బంధువు. మరి ఈ విధంగానైనా ఆమె ఈ చిత్రానికి ఓకే చెబుతుందా? లేదా? చూడాలి. ఓకే చెబితే మాత్రం ఈ చిత్రంపై ఇప్పటి నుంచే ఉన్న భారీ అంచనాలు మరింతగా పెరగడం ఖాయమని చెప్పాలి.