సాయిధరమ్ తేజ్ హీరోగా కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం(మోహన్) నిర్మించిన చిత్రం ‘చిత్రలహరి’. ఈ సినిమా సక్సెస్ మీట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో...
సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా సక్సెస్ బాగా కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు కానీ.. నా దృష్టిలో అది కాదు. సినిమా ప్రజలకు బాగా రీచ్ కావడమే. ఎంతో మంది సక్సెస్ కోసం కష్టపడుతున్నారు. అదే బిగ్గెస్ట్ సక్సెస్ అనుకుంటున్నాను. ఇది నా ఒక్కడి సక్సెస్ కాదు. నా టీంతో పాటు ఈ సినిమాను చూసి ఇన్‌స్పైర్ అయిన ప్రతి ఒక్కరికీ ఈ సక్సెస్ చెందుతుంది. ఈ కలల కోసం ఫైట్ చేయండి. ఇది జరగదు అని ఎంత చెప్పినా వినకండి. మీపై మీరు నమ్మకం ఉంచండి. పోరాడండి.. కచ్చితంగా సక్సెస్ దక్కుతుంది. అవకాశం ఇచ్చిన నిర్మాతలు నవీన్‌గారికి, రవిగారికి, మోహన్‌గారికి థాంక్స్. కిషోర్‌కి థాంక్స్. నా స్నేహితుడే. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌లకు థాంక్స్. దేవిశ్రీప్రసాద్‌గారు బ్యూటీఫుల్ ట్యూన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నా గ్లాస్‌మేట్స్ సునీల్ అన్న, హైపర్ ఆది అన్న, సుదర్శన్ చాలా కంఫర్ట్ ఇచ్చారు. నాకు పోసానిగారంటే చాలా ఇష్టం. లవ్‌లీ పర్సన్. ఆయన క్యారెక్టర్‌లో నేను మా అమ్మను చూసుకున్నాను. మెగాఫ్యాన్స్ అందరికీ థాంక్స్’’ అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ - ‘‘సినిమాలో తేజుని చూసినప్పుడు పర్సనల్‌గా కూడా నాకు తేజునే గుర్తుకొచ్చాడు. తన ఫస్ట్ సినిమా కంప్లీట్ కాలేదు. డిస్ట్రబ్‌గా ఉన్నప్పుడు కేరింత సినిమా చేద్దామని తేజుని పిలిచాను. అప్పుడు తన ఫేస్‌లో కనపడ్డ హ్యాపీనెస్. ఈ సినిమా క్లైమాక్స్ తర్వాత తన ఫేస్‌లో కనపడింది. సక్సెస్ అనేది వస్తే ఎలా ఉంటామో మాకే తెలుసు. మా తేజుకి మంచి సక్సెస్ రావడం చాలా హ్యపీగా ఉంది. తేజు దీన్ని ఇలాగే కొనసాగించాలి. ఫెయిల్యూర్ తన దరిదాపుల్లోకి కూడా రాకూడదని కోరుకుంటున్నాను. ఇక డైరెక్టర్ కిషోర్ తిరుమల సింపుల్ క్యారెక్టర్స్‌ను తీసుకుంటూ దాన్ని హీరోలకు అడాప్ట్ చేస్తూ సింపుల్‌గా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. తనకు ఆల్ ది బెస్ట్. అయితే తన స్టామినాకు సరైన సక్సెస్ రాలేదని భావిస్తున్నాను. మైత్రీ నిర్మాతలు మామూలు అదృష్టవంతులు కారు. ఎందుకంటే ఇండస్ట్రీకి రాగానే మూడు బ్లాక్ బస్టర్స్ సాధించారు. ఎవరికీ సాధ్యం కాదు. సక్సెస్ రావడం వేరు. అలాంటి సినిమాలే కుదరడం వేరు. చిన్న స్పీడు బ్రేకర్‌ను దాటి మళ్లీ సక్సెస్ బాట పట్టారు. సునీల్ ఆర్టిస్ట్ కాకముందు నుండి నాకు తెలుసు. నువ్వే కావాలితో తను స్టార్ అయిపోయాడు. హీరోగా ట్రై చేశాడు. నేను కూడా ట్రై చేశాను. వర్కవుట్ కాలేదు. మళ్లీ ఇప్పుడు సక్సెస్ బాటలోకి వచ్చాడు. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్.. కంగ్రాట్స్`` అన్నారు.
పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ - ‘‘విజయోత్సవ సభలో అందరినీ చూడటం ఆనందంగా ఉంది. ఇందులో గ్లాస్‌మేట్స్.., ప్రయత్నమే మొదటి విజయం అనే పాటలను రాశాను. ఈ రెండు పాటలు నాకు సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చాయి. ఇప్పటి వరకు 35 స్ఫూర్తి పాటలను రాశాను. దర్శక నిర్మాతలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను’’ అన్నారు.
పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ - ‘‘మైత్రీ మూవీ మేకర్స్‌కి, దర్శకుడు కిషోర్‌కి.. సాయితేజ్‌కి అభినందనలు. నాకు చాలా మంచి పాత్రను ఇచ్చారు. నాలాంటి పాత్రలు మనకు ఎక్కడైనా కనపడుతుంటుంది. ఈ సినిమాలో నాన్నలా.. నా జీవితంలో మా నాన్న, మా కొడుక్కి నేను ఉంటుంటాం. ఇంత ఐడెంటికల్ పాత్ర ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.
సునీల్ మాట్లాడుతూ - ‘‘నాకు మంచి పాత్ర ఇచ్చి ఆదరించారు. సరైన టైంలో మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు కిషోర్‌కి, నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.
దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ - ‘‘సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్’’ అన్నారు.