Advertisement
Google Ads BL

హిట్టు కాదు, సూపర్ హిట్టు కాదు.. బ్లాక్ బస్టరే!


ఎవడే సుబ్రహ్మణ్యం మొదలు.. భలే భలే మగాడివోయ్ అంటూ హిట్స్ కొట్టడం మొదలెట్టిన నాని... కృష్ణార్జున యుద్ధం వరకు వరసగా ఎనిమిది హిట్స్ కొట్టాడు. కానీ కృష్ణార్జున యుద్ధం దగ్గర నాని హిట్స్ క్రేజ్ కి బ్రేకులు పడ్డాయి. కృష్ణార్జున యుద్ధంలో మాస్, క్లాస్ లుక్ లో నాని అలరించినా.. సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు. ఇక తర్వాత జెర్సీ అంటూ క్రికెట్ బ్యాగ్రౌండ్ ఉన్న కథతో గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో నటించాడు. గత కొన్నాళ్లుగా నటనలో తనకి తానే పోటీ పడుతున్న నాని.. ఏ సినిమాకాసినిమాకే బెస్ట్ పెరఫార్మెన్సు ఇచ్చాడనుకుంటుంటే.. ఎప్పటికప్పుడు తన నటనను తానే బ్రేక్ చేస్తూ దూసుకుపోతున్నాడు. సహజ సిద్దమైన నటనతో నాని చేస్తున్న పాత్రలు అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. జెర్సీ లో నాని అర్జున్ పాత్రలో నటించలేదు 100 కి 100 శాతం జీవించాడు. అర్జున్ పాత్రకి నాని తప్ప బెస్ట్ ఆప్షన్ లేదన్నట్టుగా నాని నటన ఉంది.

Advertisement
CJ Advs

అర్జున్ పాత్రకి ప్రాణం పోసిన నాని.. ఆ పాత్రలో కెరీర్ లో ఫెయిల్ అవడము, లంచం తీసుకున్నాడని అపోహతో ఉద్యోగం పోగొట్టుకున్న వాడిగా, భార్య ముందు చేతకానివాడిలా, కొడుకు ముందు హీరోలాగా ఉండాలనే తపనతో తనలో తానే పడే మానసిక సంఘర్షణలో... కనిపించనివ్వని ఎమోషన్స్‌తో నాని నటన ఆద్యంతం అద్భుతమే. గౌతమ్ రాసుకున్న కథకు.. నాని జీవం పోసాడు. అర్జున్ పాత్ర ఒప్పుకుని నాని అక్కడే సక్సెస్ అయ్యాడు. జెర్సీలో నాని నటనకు క్రిటిక్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు వేయినోళ్ల పొగుడుతున్నారు. 

రంజీ కప్‌కి సెలక్ట్ అయినప్పుడు కోచ్ తో చెబుతూ భావోద్వేగానికిలోనయ్యే సన్నివేశం, కొడుకు 500 రూపాయలతో జెర్సీ కొనివ్వమన్నప్పుడు.. అందరిని అప్పు అడిగి.. అలిసిపోయి భార్య పర్సు లో దొంగతనము చేస్తూ దొరికిపోయి సందర్భంలోను నాని నటనకు థియేటర్స్ లో క్లాప్స్ మోగుతున్నాయి. మరి జెర్సీ సినిమాతో నాని హిట్ కాదు.. సూపర్ హిట్ కాదు కాదు.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మరి ఈ అద్భుతమైన ఆనంద క్షణాల్ని నాని తన కొడుకు అర్జున్(జున్నుగాడితో)తో పంచుకుంటున్నాడు.

Nani Jersey gets Block Buster Response at Box Office:

Nani gets Block Buster with Jersey
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs