Advertisement
Google Ads BL

బన్నీ, త్రివిక్రమ్ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్?


త్రివిక్రమ్ - అల్లు అర్జున్ ల కాంబోలో మూడో సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబో హిట్ కాంబో. అందుకే త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ సినిమా అని అనౌన్సమెంట్ వచ్చినప్పటి నుండి.. ఆ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. గతంలో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో తండ్రి మీద ఒక కొడుకుకు ఉన్న ప్రేమతో ఆ తండ్రిని సమాజంలో ఎలాంటి ఎత్తులో నించోబెడతాడో అనేది సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో చూపించాడు. అంటే తండ్రీకొడుకుల కథతో ఆ సినిమా తెరకెక్కి హిట్ అయింది. తాజాగా అల్లు అర్జున్ తో మరోసారి తండ్రి సెంటిమెంట్ టోన్ తో త్రివిక్రమ్ ఈ సినిమా  కూడా తియ్యబోతున్నాడని.. టైటిల్ కూడా నేను నాన్నా అంటూ ప్రచారం జోరుగా జరిగింది.

Advertisement
CJ Advs

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబోలో సన్నాఫ్ సత్యమూర్తి అంటూ తండ్రి కొడుకుల అనుబంధాన్ని చూపించేసారు. మరోమారు ఎందుకులే అని.. ఈసారి తల్లి సెంటిమెంట్ తో సినిమా చేయబోతున్నారట. ఇక ఈ సినిమాలో తల్లి పాత్ర ప్రాధాన్యతను సంతరించుకోవడం వల్లనే.... ఆ పాత్రకి గాను భారీ పారితోషకం ఇచ్చి మరీ టబును తీసుకున్నారని అంటున్నారు. తల్లి పాత్రకున్న వెయిట్ వలన... తల్లి పాత్ర వైపు నుంచి టైటిల్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే అలకనంద అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. మరి అలకనంద అనే టైటిల్ కి త్రివిక్రమ్ మాత్రమే కాదు అల్లు అర్జున్ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నాడట.

Allu Arjun, Trivikram Srinivas Film Alakananda:

Bunny’s Film Story, Title Changed  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs