ఈమధ్య మన టాలీవుడ్ హీరోస్ లైన్ చెప్పితే సినిమా ఓకే చేయడం లేదు. పూర్తిగా బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే సినిమాను ఓకే చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు అటువంటి సమస్యే ఎదురుకుంటున్నాడు. మహేష్ కు సుకుమార్ ఓ లైన్ చెప్పితే అది పూర్తి స్క్రిప్ట్ కావాలని కోరడంతో నానా తిప్పలు పడి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసుకుని వెళ్లే లోపే బన్నీ - సుకుమార్ కాంబినేషన్ లో సినిమాను అనౌన్స్ చేసారు.
బన్నీ దగ్గర కూడా బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇదే పెద్ద సమస్య. ఇదిలావుంటే డైరక్షన్ వ్యవహారాలు పక్కనపెట్టి, తన శిష్యుల డైరక్షన్ లో సినిమాల నిర్మాణానికి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అందులో ఒకటి ఆగిపోయింది. కారణం బౌండ్ స్క్రిప్ట్ లేకపోవడమే.
నితిన్ - సూర్య ప్రతాప్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాకి సుకుమారే నిర్మాత. అయితే ఈ సినిమాకు లైన్, కథ కాదు, బౌండ్ స్క్రిప్ట్ కావాలని హీరో నితిన్ పట్టుపట్టాడట. ఇప్పటికి అదే మాట మీద ఉన్నాడు నితిన్. విషయం తెలుసుకున్న సుకుమార్ ‘హీరోని వచ్చి కొబ్బరికాయ కొట్టి, సినిమా పక్కా చేయమను, అప్పుడు బౌండ్ స్క్రిప్ ఇద్దాం’ అని చెప్పమన్నాడట. అందుకు నితిన్ హర్ట్ అయ్యి ‘ఈ కండిషన్లేంటీ.. సమస్య లేదు, సినిమా చేసేదిలేదు’ అని తెగేసి చెప్పాడట. దాంతో సినిమా ఆగిపోయింది. అంతే కాదు నితిన్ మరొక ప్రాజెక్ట్ కూడా రెడీ చేసుకున్నాడట. సో మహేష్ బాబే కాదు...నితిన్ నే కాదు మరే బాబు అయినా స్క్రిప్ట్ చూపించకుండా సినిమాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. సో సుక్కు ఇది అర్ధం చేసుకుంటే మంచిది.