Advertisement
Google Ads BL

‘కాంచన 3’ ఒక్క సాంగ్‌కే కోటీ 30 లక్షలు


1400 మంది డాన్సర్స్ తో కోటి ముప్పై లక్షల ఖర్చుతో రాఘవ లారెన్స్ ‘కాంచన 3’ సాంగ్ చిత్రీకరణ 

Advertisement
CJ Advs

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ  స‌క్స‌ెస్ తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, స్వీయ ద‌ర్శ‌కత్వంలో ముని సిరీస్ నుంచి వ‌స్తున్న హార్ర‌ర్ కామెడీ చిత్రం కాంచ‌న‌-3. రాఘ‌వ లారెన్స్ అందించిన హార్ర‌ర్ చిత్రాల‌న్నీ సౌత్ ఇండియాలో  బ్లాక్‌బ‌స్ట‌ర్స్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన‌వే. అన్నిటినీ మించి ఈ కాంచ‌న‌-3 మాత్రం లారెన్స్ కి స్పెష‌ల్ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రాన్ని  తెలుగులో ప్రముఖ నిర్మాత బి.మ‌ధు విడుదల చేస్తున్నారు. 

రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో రాఘ‌వ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో  ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుద‌ల చేయనున్నారు. ప్రతీ చిత్రంలో రాఘవ లారెన్స్ ఎన్నో థ్రిల్స్ అందిస్తూ వస్తున్నారు . ఈ సారి కూడా కాంచన 3 లో చాలా థ్రిల్స్ ఉండబోతున్నాయి. దాదాపు 1400 మంది డాన్సర్స్ తో కోటి ముప్పై లక్షలు ఖర్చుపెట్టి ఓ పాటను చిత్రీకరించడం విశేషం.

ఈ సంద‌ర్బంగా  బి. మధు  మాట్లాడుతూ .... కాంచన 3 చిత్రం ఏప్రిల్ 19 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఈ చిత్రంలో హీరో అండ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన నట విశ్వరూపం చూపించాడు. అంతే కాదు.... గ్రాండ్ స్కేల్ లో ఈ చిత్రం తెరకెక్కింది. దాదాపు 1400 మంది డాన్సర్స్ తో మాస్టర్ అత్యద్భుతంగా సాంగ్ ని షూట్ చేశారు. 400 మంది అఘోరా గెటప్స్ తో... 1000 మంది డిఫ్రెంట్ లుక్  తో 6 రోజుల పాటు సాంగ్ చిత్రీకరణ చేశారు. లారెన్స్ కి   కాంచన 3 చిత్రం తన  కెరీర్ కే ప్రత్యేకమైంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కథ, కథనం, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. గతంలో వచ్చిన  చిత్రాల కంటే బలమైన కథ, కథనంతో రూపొందించారు.

అలాగే మంచి సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ తో థ్రిల్ చేయనున్నారు.  ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ మీద చూడని గొప్ప నటన మీరు ఈ నెల 19 న  తెలుగు, తమిళ భాషల్లో చూస్తారు.. మా బ్యానర్ లో ఈ చిత్రం చాలా మంచి విజయాన్ని అందుకుంటుంది అని నా గట్టి నమ్మకం... మాస్ కమర్షియల్ చిత్రాలు తీయటంలో సిద్ధహస్తుడు మన లారెన్స్ మరొక్కసారి తానేంటో ప్రూవ్  చేసుకున్నాడు. తప్పకుండా కాంచన 3 అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అని అన్నారు.

Shocking Budget to Kanchana 3 Movie Song:

1400 Dancers in Kanchana 3 Movie Song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs