కింగ్ నాగార్జున విషయానికి వస్తే ఆయనకు టాలీవుడ్ మన్మథునిగా పేరుంది. అరవై ఏళ్ల వయసులో కూడా ఆయన యంగ్‌కి ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తూ ఉంటాడు. అతిశయోక్తి కాదు గానీ నాగార్జున పక్కన ఆయన కుమారులైన నాగచైతన్య, అఖిల్‌లు కూడా పనికిరారు. ఇక ఈయన తన కెరీర్‌లో ఇప్పటికే ‘మన్మథుడు’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ తరహా రొమాంటిక్‌గా, ఆడవారు కనిపిస్తే చాలు సరసాలకు సిద్దమై పోయే మిస్టర్ రోమియోగా కనిపించి మెప్పిస్తూ వచ్చాడు. నాడు ‘మన్మథుడు’ చిత్రం వచ్చే సరికి ఆయనకు ఎలాగూ రొమాంటిక్ ఇమేజ్ ఉంది. కానీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సమయంలో ఆయన తన వయసుని మించి సరసాలు చేసిన పాత్ర ఎవ్వరు మర్చిపోలేరు.
ప్రస్తుతం నాగ్ ‘మన్మథుడు 2’తో పాటు ‘సోగ్గాడే చిన్నినాయనా’కి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఆయన పలువురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడని సమాచారం. మరి ఈ భాగంలో లావణ్యత్రిపాఠి, రమ్యకృష్ణ వంటి వారు ఉంటారా? లేదా? అనే విషయం తెలియరావడం లేదు. ‘మన్మథుడు 2’లో మాత్రం ఆయన రకల్‌ప్రీత్‌సింగ్‌తో పాటు పలువురు యంగ్ హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు.
ఇక విషయానికి వస్తే ‘బంగార్రాజు’ చిత్రంలో ముందుగా నయనతార నటించనుందని వార్తలు వచ్చాయి. కానీ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న నయనతార ఈ చిత్రంలో నటించలేనని చెప్పిందట. దాంతో మాజీ స్టార్ హీరోయిన్, ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ సూర్య భార్య జ్యోతికను ఈ పాత్ర కోసం తీసుకున్నారని తెలుస్తోంది. సూర్యతో వివాహం తర్వాత సంసారం, పిల్లల బాగోగులకే పరిమితమైన జ్యోతిక ఇటీవల రీఎంట్రీ ఇచ్చి కోలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తోంది. ఇక ‘బంగార్రాజు’కు జ్యోతిక గ్రీన్‌సిగ్నల్ ఇస్తే 15ఏళ్ల తర్వాత అంటే నాడు లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘మాస్’ చిత్రం తర్వాత నాగ్‌తో జ్యోతిక జోడీ కట్టడం ఇదే అవుతుందని చెప్పాలి.