Advertisement
Google Ads BL

బన్నీకి ‘RRR’ హీరోయిన్‌పై కన్నుపడింది


ఏదైనా స్టార్ హీరో పక్కన చేస్తున్న హీరోయిన్ మీదే మరో స్టార్ హీరో కళ్ళుంటాయి. అంతేకాదు ఒక క్రేజ్ ఉన్న హీరోయిన్ చుట్టూనే స్టార్ హీరోలు పడుతుంటారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ పూజా హెగ్డేనే. ఆమెకి ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినా... అల్లు అర్జున్ సరసన నటించింది కదా అని... ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ కూడా వెంటపడ్డారు. అలాగే మహేష్ తో భరత్ అనే నేనులో చేస్తుంది కదా అని కైరా అద్వానీని రామ్ చరణ్ తన వినయ విధేయరామలో తీసుకున్నాడు. అదే కైరా అద్వానీపై అల్లు అర్జున్ కూడా కన్నేశాడు. కానీ వినయ విధేయరామతో ఆమె క్రేజ్ దెబ్బతినడంతో.. ఆమెకున్న క్రేజ్ చాలదని డ్రాపయ్యి.. మళ్ళీ పూజా హెగ్డేనే ఫైనల్ చేసారు.

Advertisement
CJ Advs

ఇక అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా నేడు మొదలుకానుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్, కేథరిన్ సెకండ్ హీరోయిన్. తాజాగా అల్లు అర్జున్ ఇప్పుడు తన బావ రామ్ చరణ్ హీరోయిన్ మీద కన్నెసినట్లుగా వార్తలొస్తున్నాయి. అది కూడా RRR లో రామ్ చరణ్ పక్కన చెయ్యబోయే అలియా భట్ అయితే వేణు శ్రీ రామ్ సినిమాలో బావుంటుందని.. దిల్ రాజుతో అల్లు అర్జున్ చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. RRR కోసం అలియాని రాజమౌళి అండ్ టీం భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ తీసుకొచ్చాడు. 

మరి అలియా భట్ క్రేజ్ అలాంటిది. మరి దిల్ రాజు అంత రెమ్యూనరేషన్ అలియా భట్ కి పెడతాడా? అదేమో తెలియదు కానీ.. అల్లు అర్జున్ మాత్రం వేణు శ్రీ రామ్ తో చెయ్యబోయే సినిమాకి అలియాని ట్రై చెయ్యమని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఎలాగూ అల్లు అర్జున్ కి హిందీ యూట్యూబ్ కి మంచి క్రేజ్ ఉంది. అందుకే అలియా భట్ అయితే ఆ క్రేజ్ ని థియేట్రికల్ గా కూడా పెంచుకోవచ్చని బన్నీ ఆశ. 

Allu Arjun Wants RRR Heroine for Icon:

Allu Arjun Wants Alia Bhatt for Venu Sriram Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs