Advertisement
Google Ads BL

సాయితేజ్.. కాస్త ఊపిరిపీల్చుకోవచ్చు


ఆరు ప్లాప్స్ తర్వాత ఒక ఆశా కిరణంలా ఆ హీరోకి చిత్రలహరి కనబడుతుంది. సాయి ధరమ్ తేజ్ వరసగా ఆరు ప్లాప్స్ తో తన మార్కెట్ మొత్తం పోగొట్టుకున్నాడు. కథలు బావున్నాయా.. దర్శకుడు ఎలా తీస్తున్నాడో చెక్ చేసుకోకుండా ఎడా పెడా సినిమాలు చేసుకుపోతూ.. ప్లాప్స్ ఊబిలో కూరుకుపోయాడు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చేస్తే.. సినిమాల్లో విషయం లేకపోయినా హిట్ అవుతాయనుకుంటే.. దానికన్నా బుద్దితక్కువతనం మరొకటి ఉండదు. అలాగే సాయి ధరమ్ కూడా వరుస ప్లాప్స్ తో తన మీదున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ఇక ప్లాప్ డైరెక్టర్ అని తెలిసినా కిషోర్ తిరుమలతో చిత్రలహరి సినిమాని పట్టాలెక్కించాడు. అయితే ఈ సినిమాని సక్సెస్ ఫుల్ బ్యానర్ మైత్రి మూవీస్ వారు నిర్మించడంతో సినిమా మీద మొదటి నుండి అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇక ట్రైలర్ చూడగానే సినిమాలో విషయముందని ప్రేక్షకుల్లో కూడా అంచనాలు పెరిగాయి. మరి నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రలహరి సినిమా యావరేజ్ టాక్ తో.. మిక్స్డ్ రివ్యూ తో థియేటర్స్ లో రన్ అవుతుంది.

Advertisement
CJ Advs

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కాస్తా.. సాయి తేజ్ గా పేరు మార్చుకున్నాడు. అయితే ఈ సినిమాతో సాయి ధరమ్ హిట్ కొట్టాడో లేదో అనేది పక్కనబెడితే.. ఈ సినిమాలో సాయి తేజ్ నటనకు ప్రశంశలు దక్కుతున్నాయి. ఈ సినిమాకు ప్లస్ గా నిలిచింది సాయి తేజ్ పెర్ ఫార్మెన్స్. దర్శకుడు రాసుకున్న సంభాషణలతో సాయి తేజ్ తన కెరీర్ బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. చాలా సెటిల్డ్ గా, నాచురల్ గా నటించాడు. ఎక్కడా హీరోయిజం లేకుండా సగటు కుర్రాడిగా సాయి తేజ్ నటన చూస్తుంటే ఎవరో కొత్త హీరోను చూస్తున్న భావన కలుగుతుంది. లుక్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, యాక్టింగ్ ఇలా అన్నింట్లోనూ కొత్దదనం చూపించాడు. విజయ్ పాత్రకు న్యాయం చేశాడు. కాకపోతే ఎమోషనల్ సన్నివేశాల్లో ఇంకొంచెం మెరుగ్గా చేసి ఉండాల్సిందనిపిస్తుంది. 

మరి చిత్రలహరికి కథ బావున్నా కథనంలో లోటు, సంగీతం పర్వాలేదనిపించేలా, నేపధ్య సంగీతం బావుంది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునేలా ఉంది. కాకపోతే కాస్తస్లో నేరేషన్, సెకండ్ హాఫ్ వీక్, క్లైమాక్స్ లో కొత్తదనం లేకపోవడంతోనే సినిమాకి యావరేజ్ పడింది. అయితే సాయి తేజ్ గత చిత్రాలైన ఆరు చిత్రాలు కన్నా ఈ చిత్రలహరి మాత్రం బావుంది అనేలా వుంది.

Good Reports to Sai Dharam Tej Chitralahari film:

Sai dharam Tej Role get Good Response in Chitralahari
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs