సాయి ధరమ్ తేజ్ కి ఆరు ప్లాప్స్, కళ్యాణి ప్రియ దర్శినికి హలో ప్లాప్, కిషోర్ తిరుమలకి ఉన్నది ఒకటే జిందగీ ప్లాప్. మరి ఈ ప్లాప్స్ త్రయం కలిసి ఒక సినిమా చేస్తే ఆ సినిమా మీద మార్కెట్ లో ట్రేడ్ లో ఎలాంటి అంచనాలుంటాయి. కానీ ఆ అందరూ కలిసి చేసిన చిత్రలహరి సినిమా మీద ట్రేడ్ ల్లోనూ ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తే ఉంది. చిత్రలహరి సాంగ్ ప్రోమోస్, ట్రైలర్ అన్ని సినిమా మీద అంచనాలు పెంచేసాయి. ప్రస్తుతం చిత్రలహరి సినిమా నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ప్రమోషన్స్ తో సినిమా మీద ఆసక్తి కలిగేలా చేసిన సాయి ధరమ్.. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చిత్రలహరి సినిమా విషయంలో కొరటాల పాత్ర గురించి ఆసక్తికర విషయాన్నీ మీడియాతో పంచుకున్నాడు.
చిత్రలహరి సినిమా చేసిన వారంతా ఏదో ఒక ప్లాప్ తో ఉన్నవాళ్ళమే. అందుకే ఈ సినిమా హిట్ అందరికి చాలా అవసరం. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన కొరటాలకి చూపించి ఆయన సజెషన్స్ తో సినిమా చేసాము. కొరటాల ఇచ్చిన సలహాలు సూచనలు సరిగ్గా అమలు చేస్తూ చిత్రలహరి షూటింగ్ పూర్తి చేశామని .. కొరటాల శివ చెప్పిన విషయాలు తమకెంతో ఉపయోగపడ్డాయని చెప్పిన సాయి ధరమ్.. చిత్రలహరి కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా కొరటాల శ్రద్ద తీసుకోబట్టి మాకు ఈ సినిమా విజయంపై నమ్మకం కలిగిందని చెబుతున్నాడు. మరి దీనినిబట్టి చిత్రలహరిలో కొరటాల హ్యాండ్ ఎంత బలంగా ఉందో అర్ధమవుతుంది.