Advertisement
Google Ads BL

మల్టీస్టారర్ అని క్రియేట్ చేస్తున్నారంతే.. అంతేగా?


సమ్మోహనం తర్వాత ఇంద్రగంటి మోహన కృష్ణ ఒక మల్టీస్టారర్ కథని రెడీ చేసుకుని... నిర్మాత దిల్ రాజుతో ఆ సినిమాని ఇద్దరు హీరోలతో పట్టాలెక్కించాలని ప్రయత్నం చెయ్యడం.. ఆ సినిమాలో హీరోగా సుధీర్ బాబుని తీసుకున్న ఇంద్రగంటి.. మరో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో హీరో నానిని తీసుకున్నాడు. ఇంద్రగంటి మీదున్న గౌరవంతోనూ, కథ మీదున్న ఇంట్రెస్ట్ తోనూ నాని ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రని ఒప్పుకోవడమే కాదు.. ఆ సినిమాకి దిల్ రాజుతో పాటుగా ప్రొడ్యూస్ కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కాకపోతే నాని ప్రొడ్యూస్ చేసే విషయంలో క్లారిటీ లేదు.

Advertisement
CJ Advs

ఇకపోతే ఈ సినిమా టైటిల్ గా ‘వ్యూహం’ అనే ప్రచారం కూడా జరుగుతుంది. ‘వ్యూహం’ టైటిల్ దాదాపుగా ఫైనల్ అంటున్నారు. కాకపోతే నాని ఈసినిమాలో ఫుల్ లెన్త్ రోల్ చెయ్యడం లేదని.. ఒక కీలకపాత్రలో కొద్దిసేపు మాత్రమే సినిమాలో కనిపిస్తాడని చెబుతున్నారు. కానీ నాని మాత్రం ఈ సినిమాలో ఫుల్ లెన్త్ నెగెటివ్ రోల్ చేస్తున్నట్లుగా కావాలనే ప్రచారం చేస్తూ ఇదో మల్లీస్టారర్ అని టీం బిల్డప్ ఇస్తున్నారు అంటున్నారు. నాని గెస్ట్ రోల్ కి ఎక్కువ, ఫుల్ లెన్త్ రోల్ కి తక్కువ రోల్ లో కనిపిస్తాడట.

మరి ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ బాగా నడవడంతో.. మల్టీస్టారర్ అనగానే సినిమాల మీద ఆటోమాటిక్ గా క్రేజ్ వస్తుంది. అందుకే ఇంద్రగంటి - దిల్ రాజులూ కావాలనే నాని - సుధీర్ బాబుల సినిమాని మల్టీస్టారర్ గా ప్రమోట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది వ్యవహారం. 

Vyooham Not A multistarrer Movie:

Nani Guest Role in indraganti Vyooham
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs