Advertisement
Google Ads BL

శ్రద్దా కపూర్ కంటే అలియానే హాట్ గురూ!


సాహో చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తుందని తెలిసినప్పుడు అందరూ ఓ అన్నంత వింతగా ఏమి చూడలేదు. ప్రభాస్ రేంజ్ పెరిగింది.... సాహో సినిమాని నేషనల్ వైడ్ గా తెరకెక్కిస్తున్నాడు  అందుకే బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుంటున్నాడని అన్నారు. అలాగే అప్పటికి శ్రద్ద కూడా ఓ అన్నంత బ్లాక్ బస్టర్స్ హిట్స్ లోను నటించలేదు కాబట్టి.. సాహో సినిమాకి శ్రద్ద హీరోయిన్ అన్నప్పటికీ.. జనాల్లో ఓ అన్నంత ఆసక్తి కనిపించలేదు. కానీ రామ్ చరణ్ పక్కన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ RRR లో నటిస్తుంది అనగానే అందరి అటెన్షన్ అలియా మీదకే మళ్లింది.

Advertisement
CJ Advs

ఇక మెగా ఫ్యాన్స్ అయితే గూగుల్ సెర్చింగ్ లో అలియా భట్ ని తెగ సెర్చ్ చేస్తున్నారు. అసలే ప్రస్తుతం ఫుల్ క్రేజ్ లో అలియా బాలీవుడ్ లో దూసుకుపోతున్న వేళ రాజమౌళి RRR కోసం ఆమెని తీసుకురావడం కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం 1000 కోట్లతో పలు భారీ బడ్జెట్ సినిమాల్లో అలియా నటిస్తుంది. అందుకే సాహోతో శ్రద్ధకి రాని క్రేజ్ ఇక్కడ RRR తో అలియాకి వచ్చేస్తుంది. అందుకే అలియా భట్ ఏ అవార్డు ఫంక్షన్స్ లోనో, ఏ పార్టీలో కనబడినా టాలీవుడ్ మీడియా ఫోకస్ మొత్తం ఈ బాలీవుడ్ చిన్నదాని మీదే ఉంటుంది. అలియా ఆ డ్రెస్ వేసుకుంది. అలియా ఈ డ్రెస్ వేసుకుంది అంటూ తెగ న్యూస్ లు రాసేస్తుంది. మరి గత ఏడాది హిట్ మూవీస్ తో బాలీవుడ్ లో దూసుకుపోయిన అలియా భట్... ఈ ఏడాది తాను నటించిన ఏ ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయినా చాలు.. ఆమె క్రేజ్ ఏ లెవెల్ కి పెరుగుతుందో అనేది తెలియడానికి.

Superb Craze to Alia Bhatt Then Shraddha Kapoor:

Alia bhatt top in Craze list
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs