నాగార్జున - కళ్యాణ్ కృష్ణ కాంబోలో బంగార్రాజు సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుంది. సోగ్గాడే చిన్నినాయనా కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగార్జున తో పాటుగా.. ఓ గెస్ట్ రోల్ లాంటి రోల్ లో నాగ చైతన్య కూడా నటించబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే మజిలీ హిట్ తర్వాత నాగ చైతన్య కన్నా నాగ్ కి మనవడి పాత్రలో అఖిల్ అయితే బావుంటాడని.. నాగ చైతన్య ప్లేస్ లోకి అఖిల్ ని తీసుకునే ఆలోచనలో నాగార్జున తో పాటుగా బంగార్రాజు చిత్ర బృందం ఉందట. మజిలీ లాంటి ఎమోషనల్ హిట్ తర్వాత నాగ చైతన్య తో ఈ పాత్ర చేయించడం కరెక్ట్ కాదని నాగ్ భావనగా చెబుతున్నారు.
ఎలాగూ అఖిల్ కి ఇంతవరకు హీరోగా బ్రేక్ రాలేదు అందుకే... ఈ బంగార్రాజు తో అఖిల్ క్రేజ్ మరింత పెరిగేలా అఖిల్ కేరెక్టర్ ని ఈ సినిమాలో డిజైన్ చేయమని.. నాగ్ కళ్యాణ్ కృష్ణ కి చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక అఖిల్ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఇంకా పట్టాలెక్కించలేదు. మరి నాగార్జున అఖిల్ ఒకే సినిమాలో కనబడితే.. అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇక నాగ్ - అఖిల్ కాంబో మీద త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
ఇకపోతే ఈ సినిమాలో నాగార్జున కి హీరోయిన్ గా నయనతార ని పట్టుకొచ్చే ప్రయత్నాల్లో కళ్యాణ్ కృష్ణ ఉన్నాడు కానీ.. నయనతార బిజీ వలన బంగార్రాజు లో నాగ్ సరసన నటిస్తుందో లేదో కాస్త డౌట్. మరి చివరికి నాగ్ కి అనుష్క నే సెట్ అయ్యేలా ఉందనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి.