గత వారం మజిలీ సినిమా హిట్ అయితే.. ప్రేమకథాచిత్రమ్ 2 ఫట్. మజిలీ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో ప్రేక్షకుడి బోర్ ని దూరం చేసింది. రిపీట్ ఆడియన్స్ లేకపోయినా.. మజిలీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి.. లాభాల దిశగా పయనిస్తుంది. చైతు కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా మజిలీ నిలవబోతుంది. ఇక ఈ వారం పరిస్థితి ఇలా ఉంటే... ఈ శుక్రవారం మెగా హీరో సాయి ధరమ్ - నివేతా పేతురేజ్ - కళ్యాణి ప్రియదర్శిని జంటగా నటించిన చిత్రలహరి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మరి డబుల్ డిజాస్టర్స్ తో సాయి ధరమ్ ప్రస్తుతం చిత్రలహరి మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి కూడా శుక్రవారంతో ముగియనుంది. మరి ఎన్నికల వేడి ముగిసినాక చాలామంది ఫ్రీ అవుతారు. మరి చిత్రలహరికి టాక్ కాస్త లేచినా సినిమా హిట్ అవుతుంది. ప్రస్తుతం చిత్రలహరికి పోటీ గా మరో తెలుగు చిత్రము లేదు. కానీ మలయాళం నుండి లూసిఫర్ తెలుగులో డబ్ అవుతుంది. మరి చిత్రలహరి చిత్రానికి అన్ని పాజిటివ్ గానే కనబడుతున్నాయి. ఈ సినిమా లో ఫుల్ గా కామెడీ ఉందని ట్రైలర్ లోను..... అలాగే సెన్సార్ వారు క్లిన్ యు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు అంటే.. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎక్కుతుందనే ఫీలింగ్ రావడం కూడా సినిమాకి పాజిటివ్ గా కనబడుతుంది. మరి సాయి తేజ్ లక్కేలా ఉందో ఈ చిత్రలహరి తేల్చేయనుంది. దర్శకుడు కిషోర్ తిరుమల.. సాయి ధరమ్ ని ఏ తీరానికి చేర్చనున్నాడో మరొక్క రోజులో తేలిపోతుందిలే. ప్రస్తుతానికైతే థియేటర్స్ కళకళలాడుతున్నాయి. మరి రాబోయే వారం ఎలా వుంటుందో చూడాలి.