Advertisement
Google Ads BL

నోట్లరద్దుపై సాంగ్.. అదిరింది


‘క్యాష్  క్యాష్’ చిత్రం లోని నోట్లరద్దు గీతాన్ని విడుదలచేసిన దర్శకుడు ‘బాబీ’    

Advertisement
CJ Advs

తమిళంలో ‘థట్రోమ్ థూక్రోమ్’ పేరుతో రూపొందుతున్న చిత్రమ్ ‘క్యాష్ క్యాష్’ పేరుతో తెలుగులో విడుదల కాబోతుంది. మీడియా మార్షల్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు అరుళ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో  మొదటి సింగిల్ ‘డిమోనిటైజేషన్ సాంగ్’ను దర్శకుడు బాబీ విడుదల చేసారు.

ఈ సందర్భంగా దర్శకుడు అరుళ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ పాట తమిళంలో ఒక ఉద్రేకంతో జనంలోకి వెళ్ళింది. అలాగే తెలుగు ప్రేక్షకులను ఈ పాట అలాగే ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ పాటను లాంచ్ చేసినందుకు స్టార్ డైరెక్టర్ బాబీగారికి నా ధన్యవాదాలు.. అని అన్నారు.

అనంతరం దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ఈ పాట వినగానే నోట్ల రద్దు సమయంలో ఎదుర్కొన్న కొన్ని వాస్తవిక పరిస్థితులను గుర్తుకు తెచ్చింది. అలాగే  ప్రజలు ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా ఈ సినిమాను చిత్రీకరించిన పద్ధతి నన్ను చాలా బాగా ఆకర్షించింది. ఈ సినిమా కోసం  నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.. అని తెలిపారు.

ఈ చిత్ర సంగీత దర్శకుడు డిజే వసంత్ మాట్లాడుతూ.. నేను సంగీత దర్శకుడిని అయినా.. తెలుగులో మొట్టమొదటి సారిగా ఈ సినిమా కోసం ఈ పాట రాశాను. ఈ చిత్రబృందం ఓ గీత రచయిత ఉంటే చెప్పండి అని నన్ను అడిగారు. నోట్ల రద్దు టైంలోని పరిస్థితుల గురించి పాట రాయాలి అన్నప్పుడు.. అప్పటి పరిస్థితులు ఎదుర్కున్న వాడిగా  నేనెందుకు ఈ పాట రాయకూడదు అనిపించింది. అలా ఈ పాటను రాసాను. బాగా వచ్చింది. మీరందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను.. అని చెప్పారు.

కాగా ఈ సాంగ్ ను తమిళ్ హీరో శింబు పాడారు. మ్యూజిక్ సెన్స్ ఉన్న శింబు ఈ పాట పాడటం వల్ల పాట చాలా బాగా వచ్చింది.  ముందుగా ఈ సినిమా నుండి ప్రతిష్టాత్మక గీతంతో ప్రమోషన్స్ ను మొదలు పెట్టడం ఆనందంగా ఉందని చిత్రబృందం చెప్పుకొచ్చింది. ఇక ఈ  క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ...  ‘జీవితంలో ఎదగాలి  పెద్దగా డబ్బు సంపాదించాలనుకునే  ముగ్గురు అబ్బాయిల చుట్టూ తిరిగే కథ’.  ఈ సినిమా ముఖ్యంగా భారత్ లోని ప్రజలు డిమానిటైజేషన్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.  ఆ సమయంలో సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు?  అనే నేపధ్యంలో ఈ చిత్రం సాగనుంది. త్వరలో ఈ చిత్రం విడుదల తేదీ మరియు చిత్రం యొక్క ఇతర వివరాలు తెలియనున్నాయి.

క్యాష్ క్యాష్  మూవీ తారాగణం & సాంకేతిక విభాగం :

నటీనటులు: టీజాయ్, శక్తివేల్ కాల్కానా, నందు సురేష్, చీను మోహన్, మారిమత్తు, కాళి వెంకట్

నిర్మాత-దర్శకుడు: అరుళ్.ఎస్

సంగీతం: బాలమురళి బాలు

కెమెరామెన్ : ఎన్ సతీష్ మురుగన్

ఎడిటర్ : సుధృష్ణన్

పాటలు & సంభాషణలు: కబీలన్ వైరమత్తు

బ్యానర్: మీడియా మార్షల్

Cash Cash Movie’s crazy new song launched:

‘Demonetisation’ Song Launched By Director Bobby
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs