Advertisement
Google Ads BL

చైతూకి ‘మజిలీ’ మాంచి బూస్టిచ్చింది


ఈ ఏడాది మొదట్లో విడుదలైన ఎఫ్ 2 సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో...అందరికి తెలుసు. కామెడీ కంటెంట్ కి ప్రేక్షకులు పడిపోవడంతో ఎఫ్ 2 అదరగొట్టే హిట్ అయ్యింది. ఇక మళ్ళీ ఆ రేంజ్ హిట్ ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన మజిలీ కొట్టేలాగే కనబడుతుంది. చైతు - సామ్ జంటగా శివ నిర్వాణ తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మజిలీ గత శుక్రవారం విడుదలై అదరగొట్టే కలెక్షన్స్ తో బాక్సాఫీసుని దున్నేస్తుంది. పిల్లలకి హాలిడేస్ టైంలో కరెక్ట్ టైంకి థియేటర్స్ లోకి దిగిన మజిలీ సినిమా అద్భుతమైన హిట్ అందుకుంది.

Advertisement
CJ Advs

కేవలం నాలుగు రోజుల్లోనే మజిలీకి పెట్టిన పెట్టుబడి వచ్చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది అంటే మజిలీ ఏ రేంజ్ హిట్టో అర్ధమవుతుంది. మజిలీ సినిమాకి థియేట్రికల్ హక్కులకు 21 కోట్లు వచ్చాయి. మరా  ఫిగర్ ని మజిలీ కేవలం నాలుగు రోజులకే అందుకుంది. మొదటి రోజే 7 కోట్లకు పైగా షేర్ సాధించి.. చైతూ కెరీర్లో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అంతేనా వీకెండ్ పూర్తయ్యేసరికి మజిలీ 17.5 కోట్ల దాకా షేర్‌ రాబట్టడం విశేషం. ఫస్ట్ వీకెండ్ లో చైతూకిదే బిగ్గెస్ట్ షేర్ సాధించిన చిత్రం కావడం కూడా విశేషమే. శని, ఆదివారాల్లో మజిలీ కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ అవ్వలేదు. 

ఇక నిన్న సోమవారం కూడా మజిలీ బుకింగ్స్ బావుండడంతోనే నాలుగు రోజులకే మజిలీ బ్రేక్ ఈవెన్ కి చేరుకుంది. మరి సోమవారం పూర్తయ్యేసరికి మజిలీకి పెట్టిన పెట్టుబడి వచ్చేస్తే.. ఈరోజు వచ్చే కలెక్షన్స్ మజిలీ నిర్మాతలకు లాభాలే లాభాలు. మజిలీ సినిమా లాంగ్ రన్ లో 35 కోట్ల క్లబ్బులో చేరేలా కనిపిస్తుంది.. చైతు కెరీర్ లో ఈ ఫిగర్ హైయ్యెస్ట్. మరి చైతు 35 కోట్ల క్లబ్బులో మజిలీతో కాలు పెడతాడో లేదో చూడాలి.

Superb Collections to Chaitu Majili:

Majili Movie Rocks at Box Office  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs