Advertisement
Google Ads BL

మొత్తానికి బన్నీ కన్ఫ్యూజ్ చేసేశాడు


చాలా సినిమాలు అధికారిక ప్రకటనలతో హైలెట్ అవుతాయి.. కానీ అందులో కొన్ని సినిమాలు పట్టాలెక్కకుండానే ఆగిపోతుంటాయి. చాలా సందర్భాలలో చాలా సినిమాలు ఇలా ఆగిపోయాయి కూడా. తాజాగా మహేష్ - సుకుమార్ సినిమా అధికారిక ప్రకటన వచ్చాకే ఆగిపోయింది. ఇక మరో స్టార్ హీరో ఏడాది కాలం క్రితం ఒక డిజాస్టర్ సినిమా చేసి అప్పటినుండి ఇప్పటివరకు కొత్త సినిమాని మొదలెట్టలేదు కానీ.. సినిమాల మీద సినిమాలు అధికారిక ప్రకటనలు ఇస్తున్నాడు. మరా హీరో ఎవరో అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారా... అదేనండి మెగా హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్ ముందు త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్ చేసాడు. అది చేసి ఆరు నెలలవుతుంది. కానీ పట్టాలెక్కలేదు. అలాగే మొన్నటికి మొన్న సుకుమార్ తో తన సినిమా ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది.

Advertisement
CJ Advs

ఇంకా ఆ సినిమా విషయంలో తర్జనభర్జలు జరుగుతున్నాయి. తాజాగా దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ తో అల్లు అర్జున్ టైటిల్ తో సహా అనౌన్స్ చేసేసాడు. ఐకాన్.. కనబడుటలేదు అనే ట్యాగ్ లైన్ తో బన్నీ బర్త్ డే రోజున దిల్ రాజు అల్లు అర్జున్ కి విషెస్ చెబుతూ సినిమాని అనౌన్స్ చేసాడు. మరి అల్లు అర్జున్ ఇలా సినిమాల మీద సినిమాలు ప్రకటిస్తూ పోతున్నాడు కానీ.. ఏ సినిమాని ఎప్పుడు మొదలెడతాడో అనేది క్లారిటీ ఇవ్వకుండా మెగా ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లో పడేస్తున్నాడు. 

ఎలా లేదన్నా త్రివిక్రమ్ సినిమా తర్వాత సుకుమార్ సినిమా మొదలవడానికి ఈ ఏడాది చివరికి కానీ సాధ్యం కాదు. మరి సుకుమార్ సినిమా వచ్చే ఏడాది.. ఆ తరవాత వేణు శ్రీ రామ్ సినిమా ఉంటుంది. మధ్యలో ఏమి జరగకపోతే... అన్ని సవ్యంగా జరిగితే ఈ ఏడాది ఒక సినిమాతో, వచ్చే ఏడాది రెండు సినిమాలతో అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు వస్తాడు. 

Allu Arjun announced One More Project:

Confusion on Allu Arjun 3 Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs