Advertisement
Google Ads BL

జీవితా రాజశేఖర్ రంగంలోకి దిగుతోందా?


జీవిత రాజశేఖర్ అంటే రాజశేఖర్ వెనుకుండి నడిపించే శక్తి. జీవిత హీరోయిన్ గా సినిమాలు ఆపెయ్యడం, భర్త చేసే సినిమాలు దగ్గరుండి చూసుకోవడం, పిలల్లకి చదువులు చెప్పించడమే కాదు.. రాజశేఖర్ వెనుకుండి నడిపించే జీవిత అన్ని విషయాల్లోనూ రాజశేఖర్ కి తోడు నీడ. అయితే గతంలో రాజశేఖర్ నటించే సినిమాల్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జీవిత జోక్యం ఎక్కువగా ఉండేదనే రూమర్ ఉంది. చాలామంది డైరెక్టర్స్ జీవిత వలన బాధపడిన సందర్భాలు ఉన్నాయనే టాక్ ఉంది. మరా సంగతి పూర్తిగా ఎవ్వరికీ తెలియదు కానీ.. ప్రస్తుతం తన కూతురు సినిమాలో జీవిత వేలెట్టబోతుందట.

Advertisement
CJ Advs

రాజశేఖర్ పెద్ద కూతురు శివాని... అడవి శేష్ తో 2 స్టేట్స్ రీమేక్ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంది. డాక్టర్ చదివిన శివాని తల్లితండ్రులతో కలిసి ఫ్యాషన్ షోలకి, సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళకి వెళుతూ తరుచు క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న శివాని హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న 2 స్టేట్స్ షూటింగ్ మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయింది. హీరో అడివి శేష్, మరియు దర్శకుడు వెంకట్ మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ సినిమా షూటింగ్ సగం జరిగాక ఆపేసారు నిర్మాతలు. అయితే ఈ సినిమా ఆగిపోవడం వలన అడవి శేష్ కి పెద్దగా డ్యామేజ్ జరగకపోయినా.. శివాని హీరోయిన్ ఎంట్రీ మీద నీళ్లు చల్లినట్లే.

అందుకే దర్శకుడు వెంకట్ కి హీరో అడివి శేష్ కి మధ్య ప్యాచప్ చేద్దామని జీవిత ఎంతగా ప్రయత్నించినా వర్కౌట్ కాకపోవడంతో... ఇప్పుడు ఆ సినిమా డైరెక్షన్ ని జీవిత హ్యాండిల్ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆగిపోయిన 2 స్టేట్స్ రీమేక్ ని జీవిత మిగతా షూటింగ్ కి డైరెక్షన్ చెయ్యబోతుందట. అలాగే 2 స్టేట్స్ రీమేక్ నిర్మాత నుండి ఆ సినిమాని ఓవరాల్ గా టేకప్ చేసి... నిర్మాతగా కూడా జీవితనే ఉండి.. అటు నిర్మాతగా ఇటు దర్శకురాలిగా ఆ సినిమాని పూర్తి చేసి కూతుర్ని హీరోయిన్ గా నిలబెట్టే ప్రయత్నాలు మొదలెట్టారని టాక్.

Jeevitha Rajasekhar Takes Full Rights From Him:

Jeevitha Rajasekhar Enters for Her Daughter 2 States
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs