Advertisement
Google Ads BL

బ్రేకిస్తాడనుకుంటే.. యంగ్ హీరో షాకిచ్చాడుగా!


ఛలో సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన నాగ శౌర్య నర్తనశాలతో డిజాస్టర్ కొట్టాడు. తరవాత రెండు మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఒక సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రాజా కొలుసు దర్శకత్వంలో ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాలో నాగ శౌర్య - ఈషా రెబ్బ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే సగానికి పైగా సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయిందనే న్యూస్ మొదలయింది. మొన్నటికి మొన్న సుకుమార్ నిర్మాణంలో నాగ శౌర్య సినిమాని ఆపేశారని న్యూస్ ఇంకా ప్రచారంలో ఉండగానే ఇప్పుడు నాగ శౌర్య నటిస్తున్న మరో సినిమా ఆగిపోయిందనే న్యూస్ టాలీవుడ్ ని షేక్ చేస్తుంది.

Advertisement
CJ Advs

నాగ శౌర్య - ఈషా రెబ్బల కలయికలో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించి ఇప్పటివరకు జరిగిన షూటింగ్ పై అటు  నిర్మాత ఆనంద ప్రసాద్ ఇటు హీరో నాగ శౌర్య అసంతృప్తిగా ఉండడంతో ఆ సినిమా ఆపేశారనే న్యూస్ వినబడుతుంది. మరి గత ఏడాది డిసెంబర్ లో భవ్య క్రియేషన్స్ అధిపతి నిర్మాత ఆనంద ప్రసాద్ తెలంగాణ ఎన్నికల్లో శేరిలింగం పల్లి నుండి ఎమ్యెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. అప్పుడు ఎలక్షన్స్ కారణంగా షూటింగ్ కి కొన్నాళ్లు బ్రేకిస్తే.. ఇప్పుడు మాత్రం జరిగిన షూటింగ్ నచ్చక నాగ శౌర్య సినిమా ఆపేశారట. మరి నాగ శౌర్యతో నటిస్తున్నందుకు ఈషా రెబ్బ ఎంతో ఆనంద పడింది. నాగ శౌర్య అయినా బ్రేకిస్తాడనుకున్న ఈషా రెబ్బకి ఇప్పుడు నాగ శౌర్య షాకిచ్చాడు.

Young Hero Crazy Project Shelved:

Eesha Rebba Disappointed with Naga Shourya Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs