తమిళ రీమేక్ 96 ఎట్టకేలకు తెలుగులో మొదలైంది. నిన్నమొన్నటివరకు ఆ సినిమా ఉంటుందో లేదో.. దిల్ రాజు తర్జన భర్జన పడుతున్నాడనే న్యూస్ మాములుగా నడవలేదు. అక్కడ క్లాసిక్ హిట్ అయిన 96 ని ఇక్కడ తెలుగు ప్రేక్షకులు ఒప్పుకుంటారో లేదో అనే డౌట్ కొడుతుందని... అలాగే 96 తమిళ క్లైమాక్స్ కి తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ కారేమో అందుకే ఆ సినిమా క్లైమాక్స్ విషయంలో దిల్ రాజు ఆలోచన మరోలా ఉందని అన్నారు. వాటన్నింటికి చెక్ పెడుతూ ఉగాది రోజున సింపుల్ గా 96 రీమేక్ ని మొదలెట్టేసాడు దిల్ రాజు.
అయితే తమిళంలో 96 అనే టైటిల్ పెట్టిన దర్శకనిర్మాతలు.. సినిమాని 1996 ఏడాదికి దగ్గరగానే తెరకెక్కించారు. కానీ తెలుగులో మరీ 96 కాలానికి ప్రేక్షకులు కనెక్ట్ కారని.... అందుకే ఏ 2000 ఏడాదినో సినిమాలో చూపించినా సినిమా టైటిల్ గా జాను ని పెడదామని ఆ టైటిల్ ని రిజిస్టర్ కూడా చేయించారు. 96 సినిమాలో త్రిష పేరు జానకి. అదే పేరు తెలుగులో హీరోయిన్ గా చేస్తున్న సమంతకి పెట్టి సినిమాకి జాను అనే టైటిల్ పెడదామనుకుంటే.. అదే టైటిల్ ప్రభాస్ 20 కి రాధాకృష్ణ పరిశీలిస్తున్నాడని తెలిసి.. ఇప్పుడు ఆ టైటిల్ ని మార్చే పనిలో దిల్ రాజు ఉన్నాడట. ప్రభాస్ - రాధాకృష్ణ మూవీకి జాన్ అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని.. అందుకే దిల్ రాజు ఇప్పుడు తమిళ రీమేక్ 96 కి మరో టైటిల్ వెతికే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది.