Advertisement
Google Ads BL

శివాని కంటే ముందే శివాత్మిక వస్తుందా?


యాంగ్రీస్టార్‌ రాజశేఖర్‌ కెరీరే కాదు.. ఆయన కూతుర్ల కెరీర్‌లు కూడా ఏవీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరగడం లేదు. ఏదో అనుకుంటే చివరకు ఏదో అవుతోంది. ఇక విషయానికి వస్తే రాజశేఖర్‌ పెద్ద కుమార్తె శివాని క్షణం ఫేమ్‌ అడవిశేషు సరసన జోడీగా ఓ చిత్రం ప్రారంభమైంది. ఇది 2 స్టేట్స్‌కి రీమేక్‌. శంకర్‌ అనేకొత్త దర్శకుడు దీని ద్వారా పరిచయం అవుతున్నాడు. స్వయాన రాజమౌళి వచ్చి ఈ చిత్రానికి క్లాప్‌ కొట్టాడు. కానీ ఈ చిత్రం అప్‌డేట్స్‌ మాత్రం బయటకు రావడం లేదు. ముందునుంచి అనుకుంటున్నట్లుగా ఈ చిత్రం ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. 

Advertisement
CJ Advs

అడవిశేషు గూఢచారి2, మేజర్‌లతో బిజీగా ఉన్నాడు. 2స్టేట్స్‌ రీమేక్‌ సమయంలో మొదట్లోనే దర్శకుడు శంకర్‌కి, హీరో అడవిశేషుకి విభేదాలు వచ్చాయని, తన పాత్ర కంటే శివాని పాత్రను హైలెట్ చేస్తున్న తీరు అడవి శేషుకి నచ్చలేదని సమాచారం. అంతే కాదు.. ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాల అవుట్‌పుట్‌ కూడా బాగా లేకపోవడంతో నిర్మాతలు ఈ చిత్రాన్ని హోల్డ్‌లో పెట్టారట. మరి ఇదే చిత్రాన్ని మరలా వేరే దర్శకునితో రీషూట్‌ చేస్తారా? లేక శివాని అరంగేట్రం మూవీ ఇది కాకుండా మరోది కానుందా? అనే అనుమానాలు ఉన్నాయి. 

మరోవైపు రాజశేఖర్‌ రెండో కూతురు శివాత్మిక నటించిన తొలి చిత్రం ‘దొరసాని’ షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. మరో రెండు నెలల్లోపు విడుదలకు కూడా సిద్దమవుతోంది. ఈ లెక్కన చూస్తే రాజశేఖర్‌ పెద్ద కుమార్తె కంటే ఆయన చిన్న కుమార్తె తెరంగేట్రమే ముందుగా జరగనుందని తెలుస్తోంది. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని అనేది అందుకే కదా....! 

Rajasekhar Daughters Movie Entry details:

Sivani in doubts but Sivatmika Enters with Dorasani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs