ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్‌హీరోలలో వెరైటీ సినిమాలను చేసే హీరోగా నిఖిల్‌కి మంచి పేరుంది. ప్రస్తుతం ఆయన తమిళ ‘కణితన్’కి రీమేక్‌గా ‘అర్జున్‌సురవరం’ చిత్రం చేస్తున్నాడు. కాగా ఇటీవల నిఖిల్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేశాయి. దాంతో చాలామంది నిఖిల్ తెలుగుదేశం పార్టీలో చేరాడని, ఎన్నికల్లో టిడిపికి మద్దతుగా ప్రచారం చేయనున్నాడని వ్యాఖ్యానించారు. ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న ఈయనకు ఇప్పుడు రాజకీయాలు ఎందుకు అని కూడా కొందరు విమర్శించారు.
తాజాగా ఈ రాజకీయ వార్తలపై యంగ్‌హీరో నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఆయన ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు. అందులో ఆయన మాట్లాడుతూ, నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు. మా ఫ్యామిలీ మెంబర్ అయిన కె.ఈ.ప్రతాప్‌గారు డోన్ నుంచి పోటీ చేస్తున్నారు. నేను ఆయన వద్దకు వెళ్లి బెస్ట్ విషెష్ చెప్పాను. అదే సందర్భంగా అక్కడ ఉన్న స్థానిక ప్రజలను మా అంకుల్‌కి ఓటు వేయమని అభ్యర్ధించాను. ఆయన చాలా మంచి వ్యక్తి. నిజాయితీపరుడు. ఆయన ఆ ఏరియాకు ఎంతోసేవ చేశారు. ఆయన నాకు 25ఏళ్లుగా తెలుసు. అందుకే ఆయనకు ఓటు వేయమని నేను అక్కడి ఓటర్లను అడిగాను. మంచి వాళ్లు రాజకీయాలలోకి రావాలి. నాకు తెలిసిన మంచి వ్యక్తులకు నేను పార్టీలకు అతీతంగా మద్దతు ఇస్తాను.
కానీ నేను మద్దతు ఇచ్చినంత మాత్రాన ఓట్లు పడతాయో లేదో నాకు తెలియదు. నేనేమీ అంత పెద్దవాడిని అనుకోవడం లేదు. ఒక యాక్టర్‌గా కాకుండా ఓ భారతీయునిగా నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. నిఖిల్‌కి సామాజిక స్పృహ కూడా ఎక్కువ. అగ్రవర్ణ పేదలకు మోదీ రిజర్వేషన్లు ప్రకటించిన తరుణంలో కూడా నిఖిల్ దానిపై పాజిటివ్‌గా స్పందించి, అంతకు కొద్ది రోజుల ముందే ఇదే విషయాన్ని నేను, రానా కలిసి మాట్లాడుకున్నామని తెలిపిన సంగతి తెలిసిందే.