Advertisement
Google Ads BL

‘మహర్షి’ బిజినెస్‌లో అంత ఊపులేదేంటి?


నిన్న ఉగాది కానుకగా విడుదలైన మహర్షి టీజర్ క్షణాల్లో కొన్నివేల వ్యూస్ తో యూట్యూబ్ రికార్డులను కొల్లగొట్టింది. మహేష్ క్రేజ్ అలాంటిది. కానీ మహేష్ గత సినిమాల ప్లాప్ ప్రభావం మహర్షి మీద కొద్దిగా పడినట్లుగానే కనబడుతుంది. అదెలా అంటే భరత్ అనే నేనుకి బయ్యర్లకు నష్టాలూ రాలేదుకాని.. అలాగని లాభాలు రాలేదు. బొటాబొటి కలెక్షన్స్ తో భరత్ అనే నేను గట్టెక్కింది. ఇక గతంలో స్పైడర్, బ్రహ్మ్మోత్సవాల ఎఫెక్ట్ ఇప్పటి వరకు మహర్షి మీద పడలేదు.... కానీ తాజాగా మహర్షి బిజినెస్ చూస్తుంటే కాస్త పడిందేమో అనే డౌట్ కొడుతోంది. ప్రస్తుతం మహర్షి బిజినెస్ క్లోజ్ అయ్యింది. ఈ వేసవిలో విడుదలవుతున్న అతి పెద్ద భారీ సినిమా మహర్షినే. మరి ఆ సినిమా హాట్ కేక్ ల్లా అమ్ముడుపోతుందనుకున్నారు.

Advertisement
CJ Advs

అయితే మహర్షి నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు మహర్షి సినిమాని తన పాత బయ్యర్లకే ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు భరత్ అనే నేను సినిమా మార్కెట్ చేసిన రేట్లకే దాదాపుగా మహర్షి సినిమాను అమ్మేసినట్లుగా సమాచారం. మహర్షి ఆంధ్రా హక్కులను 38 కోట్ల రేషియోలో, సీడెడ్ హక్కులను 12 కోట్లకు ఇచ్చినట్లుగా తాజా సమాచారం. ఆంధ్రాలో మాత్రం కొత్త బయ్యర్లకు, సీడెడ్ ను ఫైనాన్సిషయర్ శోభన్ కు అమ్మినట్లుగా తెలుస్తుంది. 

ఇక మహర్షికి నైజాం, ఆంధ్రాలోని వైజాగ్ ఏరియాలకు రేట్లు కట్టి నిర్మాత దిల్ రాజు ఉంచేసుకున్నాడట. ఇక నైజాం మాత్రం మహర్షి రేటు తేలలేదని.. భరత్ అనే నేనుని 22 కోట్లకు కొన్నవారికి  బొటాబొటీనా 19 కోట్లు రాబట్టడంలో ఇప్పుడు ఆ 19 కోట్లకు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఇక శాటిలైట్ 16  కోట్లకి, డిజిటల్ 11 కోట్లకి, ఓవర్సీస్ మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది. అయితే ఇప్పుడు మహర్షికి జరిగిన బిజినెస్ చూస్తుంటే మహర్షికి కాస్త డల్ లాగే కనబడుతుంది అని అంటున్నారు.

Dull Business To Maharshi Movie:

Mahesh Babu Maharshi Movie Business Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs