Advertisement
Google Ads BL

మహేష్‌ ‘మహర్షి’ ఆల్‌టైమ్‌ రికార్డ్‌


24 గంటల్లోనే 12.6 మిలియన్‌ రియల్‌ టైమ్‌ వ్యూస్‌తో  సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘మహర్షి’ ఆల్‌టైమ్‌ రికార్డ్‌ 

Advertisement
CJ Advs

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రంలో మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

ఉగాది కానుకగా ఏప్రిల్‌ 6న విడుదలైన ఈ చిత్రం టీజర్‌ వ్యూస్‌పరంగా రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తోంది. కేవలం 24 గంటల్లోనే 12.6 మిలియన్‌ రియల్‌ టైమ్‌ వ్యూస్‌ సాధించి ఆల్‌టైమ్‌ రికార్డ్‌ సృష్టించింది. టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ ఇస్తోన్న ప్రేక్షకులకు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ కృతజ్ఞతలు తెలిపింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని మే 9న సమ్మర్‌ స్పెషల్‌గా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్‌ మూవీకి కె.యు.మోహనన్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్‌, సునీల్‌బాబు, కె.ఎల్‌.ప్రవీణ్‌, రాజు సుందరం, శ్రీమణి, రామ్‌-లక్ష్మణ్‌ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి. 

Mahesh Maharshi Teaser Creates All Time Record:

Maharshi Teaser Creates Sensation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs