Advertisement
Google Ads BL

ఊరంతా అనుకుంటున్నారు హిట్టని: సాయితేజ్


ఊరంతా అనుకుంటున్నారు సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ 

Advertisement
CJ Advs

‘నందిని నర్సింగ్ హోమ్’ వంటి హిట్ చిత్రం తర్వాత నవీన్ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా మేఘ చౌదరి, సోఫియా సొన్గ్ హీరోయిన్స్ గా బాలాజీ సనాల దర్శకత్వంలో రౌఆస్కిర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్. రెడ్డి, ఎ. పద్మనాభ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కి రెడీ అవుతోంది.

కాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం ఏప్రిల్ 7న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర యూనిట్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, హిట్ చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ముఖ్య అతిధులుగా హాజారు కాగా...  హీరో నవీన్ విజయకృష్ణ, హీరోయిన్స్ మేఘ చౌదరి, సోఫియా, దర్శకుడు బాలాజీ సనాల, సంగీత దర్శకుడు కె.ఎమ్. రాధాకృష్ణ, కెమెరామెన్ జి.ఎల్.ఎన్. బాబు, నిర్మాతలు పాల్గొన్నారు. అనంతరం చిత్ర టీజర్ ని సాయి ధరమ్ తేజ్, ఇంద్రగంటి మోహనకృష్ణ రిలీజ్ చేసారు. 

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. టీజర్ చాలా బాగుంది. టీమ్ అంతా కలిసి ఒక మంచి సినిమా తీశారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలి. లాస్ట్ టు ఇయర్స్ గా డిఫ్రెషన్లో వున్నప్పుడు నవీన్ సపోర్ట్ చేసి ధైర్యం చెప్పాడు. ఒక బ్రధర్ లా గైడ్ చేసి నన్ను ఎంకరేజ్ చేసాడు. అలాంటి నవీన్  ఎప్పుడు పిలిచినా నేను వస్తాను. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 

ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ.. నవీన్ నాకు గత పదేళ్లుగా తెలుసు. వెరీ బ్రిలియంట్ ఎడిటర్ తను. ఈ పోస్టర్ చూడగానే నాకు అష్టాచెమ్మా గుర్తుకువచ్చింది. గ్రామీణ నేపథ్యంలో  ఆ పల్లె వాసన, బంధాలు బంధుత్వాలు నేపథ్యంలో వచ్చిన సినిమాలు అన్నీ బాగా ఆడాయి. ఈ సినిమా కూడా బాగుంటుందని టీజర్ చూడగానే అర్ధం అయింది. ఇలాంటి మంచి సినిమా తీసిన టీమ్ అందరికీ అభినందనలు. ఈ సినిమా హిట్ అయి నవీన్, శ్రీనివాస్ అవసరాలకు మంచి పేరు రావాలి. నిర్మాతలు పెద్ద విజయాన్ని అందుకోవాలి అన్నారు. 

హీరో నవీన్ విజయకృష్ణ మాట్లాడుతూ.. సంవత్సరం కాలంగా ఈ సినిమా చేస్తున్నాం. అందరం కలిసి ఫ్యామిలీలా కలిసి వర్క్ చేసాం. అవుట్ ఫుట్ బాగా వచ్చింది. ఇదొక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ. అందర్నీ అలరిస్తుంది. కథ విన్నప్పుడే చాలా బాగా నచ్చింది. బాలాజీ బాగా తెరకెక్కించాడు. నిర్మాతలు మంచి క్వాలిటీతో ఈ సినిమా రూపొందించారు.. అన్నారు. 

దర్శకుడు బాలాజీ సనాల మాట్లాడుతూ.. ఫస్ట్ ఈ లైన్ రమ్య గారు చెప్పారు. అప్పటినుండి ఈ కథపై వర్క్ చేస్తూ వచ్చాం. సినిమా అవుట్ ఫుట్ చూసి కాన్ఫిడెంట్ గా వున్నాం. నవీన్, అవసరాల శ్రీనివాస్ ఇద్దరూ బాగా కోపరేట్ చేసారు. నటీ నటులందరూ తమ పాత్రలకి ప్రాణం పోశారు. బాబు కెమెరా వర్క్, రాధాకృష్ణ మ్యూజిక్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.. అన్నారు. 

నిర్మాత శ్రీహరి మంగళంపల్లి మాట్లాడుతూ.. ఒక మంచి సినిమాని నిర్మించే అవకాశం ఇచ్చిన ఇండస్ట్రీకి నా ధన్యవాదాలు. కోనసీమ నేపథ్యంలో ఈ సినిమా చేశాం. పోస్టర్స్, టీజర్ కి మంచి బజ్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. అన్నారు. 

మరో నిర్మాత పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ.. పల్లెటూరి వాతావరణంలో ఈ చిత్రాన్ని రూపొందించాం. అక్కడి విలువలు, బంధాలు, ఎలావుంటాయి, వెటకారం, మమకారం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ చిత్రంలో చూపిస్తున్నాం. విజువల్ ట్రీట్ అని చెప్పవచ్చు... అన్నారు. 

నిర్మాత పి. ఎల్. ఎన్. రెడ్డి మాట్లాడుతూ.. డైరెక్టర్ బాలాజీ మంచి సినిమా తీశాడు. గొప్ప డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 

ఈ సినిమా అందరికీ నచ్చుతుందని తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు హీరోయిన్స్. 

జయసుధ, కోటశ్రీనివాసరావు, రావు రమేష్, అన్నపూర్ణ, రాజా రవీంద్ర, అశోక్ కుమార్, ప్రభావతి, జబర్దస్త్ రాము, బాబీ, గౌతమ్ రాజు, అప్పాజీ, క్రాంతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కె.ఎమ్. రాధా కృష్ణ, పాటలు వనమాలి, పెద్దాడ మూర్తి, శ్రీహరి మంగళంపల్లి, కెమెరా జి.ఎల్.యెన్ బాబు, ఎడిటింగ్ మధు, కొరియోగ్రఫీ భాను, మేకప్ ప్రేమ్ రాజ్, కథ శ్రీమంగళం, రమ్య, ఆర్ట్ కృష్ణ మాయ, ఫైట్స్ రామ్ సుంకర, నిర్మాతలు శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, ఫై.ఎల్, యెన్ రెడ్డి, ఎ. పద్మనాభ రెడ్డి, రచన దర్శకత్వం బాలాజీ సనాల  

Oorantha Anukuntunnaru Teaser Released:

Oorantha Anukuntunnaru Teaser Release Event Highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs