Advertisement
Google Ads BL

పరుగెత్తికెళ్లి చిరుతో ఫొటో దిగిన బాలీవుడ్ స్టార్


బాలీవుడ్‌లో ఆమీర్ ఖాన్ సూపర్ హిట్ హీరో. ఆయన బాలీవుడ్‌లో సూపర్ స్టార్ రేంజ్ లగాన్, దంగల్ లాంటి సినిమాల్తో ప్రేక్షకుల మదిలో చెరిగిపోని స్థానాన్ని సంపాదించిన స్టార్. ఇక టాలీవుడ్ లో సినిమాలు వదిలేసి రాజకీయాలకు వెళ్లి మళ్ళీ సినిమాలలోకి వచ్చినా.. ఇప్పటికి... ఆయనని అభిమానులు నెంబర్ వన్ హీరోగానే చూస్తున్నారు. ఆయనే మెగాస్టార్ చిరు. అలాంటి చిరుని చూసి.. ఆమీర్ ఖాన్ పరుగుపరుగున వెళ్లి ఫొటో దిగి సామజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.

Advertisement
CJ Advs

ఒకరు బాలీవుడ్ దిగ్గజం, మరొకరు టాలీవుడ్ దిగ్గజం అంటూ మెగా అభిమానులు ఆ ఫోటో‌ని క్షణాల్లో వైరల్ చేసేసారు. ఇంతకీ ఈ దిగ్గజాలిద్దరు కలిసి ఎక్కడ ఫోటో దిగారో తెలుసా.... జపాన్ లోని క్యోటో విమానాశ్రయంలో ఒకరినొకరు కలిశారు. ప్రస్తుతం జపాన్ టూర్‌లో ఉన్న చిరు దంపతులను అక్కడే ఉన్న ఆమీర్ ఖాన్ దంపతులు కూడా అక్కడే ఉండటంతో.. వీరిరువురు జపాన్ లోని క్యోటో విమానాశ్రయంలో కలుసుకోవడం జరిగింది.

అయితే క్యోటో విమానాశ్రయంలో చిరు ని కలిసిన ఆమీర్ ఖాన్ ‘‘నా అభిమాన నటుల్లో ఒకరు, సూపర్‌స్టార్‌ చిరంజీవిగారిని క్యోటో ఎయిర్‌పోర్టులో కలిశాను. చాలా గొప్ప సర్‌ప్రైజ్‌గా అనిపించింది. ఆయన తాజా ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడుకున్నాం. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథతో ఆయన సినిమా చేస్తున్నారని తెలుసుకున్నా. ఆయన ఎప్పుడూ మాకు స్ఫూర్తిని పంచుతూనే ఉంటారు. ఆయనకు ప్రేమతో’’ అని ఆమిర్‌ఖాన్‌ ట్వీట్‌ చేశారు. 

Bollywood Star Hero Meets Mega Star Chiranjeevi:

Aamir Khan Meets Chiranjeevi at Kyoto
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs