పవన్‌కళ్యాణ్ మొండితనంలో, తాను అనుకున్న దానికోసం అహర్నిశలు కష్టపడటం వంటి సుగుణాలు ఉన్న వ్యక్తి, ఒకవైపు ఎండల తీవ్రత వల్ల ఎన్నికల ప్రచారం చేస్తున్న నాయకులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. కానీ పవన్ మాత్రం అతి సామాన్యంగా ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నాడు. ఎండదెబ్బకు ఆయన శనివారం ఉదయం నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. కానీ సాయంత్రం మాత్రం యధావిధిగా తెనాలికి వెళ్లి ప్రచారం నిర్వహించాడు. ఈ సభకు పవన్ సెలైన్‌ని ఎక్కించే సూదితోనే రావడం చూస్తే ఆయన ఇంకా కోలుకోలేదన్న విషయం అర్ధమవుతోంది.
తన పార్టీలో కీలకసభ్యుడైన నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టిడిపి వాళ్లలాగా తాను భూకబ్జాలు చేయడానికి రాలేదు. మా పార్టీ నేతలు కూడా భూకబ్జాలు చేయరు. మేము నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేసేందుకే వచ్చాం. అలాగని వ్యవస్థలను నాశనం చేస్తుంటే ఊరుకునే ప్రశ్నే లేదు అని హెచ్చరిస్తున్నాను. నేను పైకి ఎంత మెతకగా కనిపిస్తానో ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మాత్రం అంత కటువుగా మారిపోతాను. జనసేన అన్ని కులాలకు సమాన ప్రాధాన్యం ఇస్తుంది. కులాల ఐక్యతకు మేం కృషి చేస్తాం. రాజకీయ నాయకులకు కులం, మతం, ప్రాంతం వంటివి ఉండకూడదని గట్టిగా నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చాడు.
ఇక జనసేన తరపున వైజాగ్ నుంచి పోటీ చేస్తున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన మేనిఫెస్టోని బాండ్ పేపర్‌పై రాసి సరికొత్త పంథాకు నాంది పలికాడు. మరి ఇవ్వన్నీ చూస్తుంటే ప్రజలు జనసేనకి వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలిపించి ఇస్తారు? అనే విషయం ఉత్కంఠగా మారింది.