Advertisement
Google Ads BL

సమంత మరో హిట్టు కొట్టింది


హీరోయిన్స్ కి పెళ్ళికి ముందు - పెళ్లి తర్వాత అంటూ కెరీర్ ని విడగొట్టి మాట్లాడతారు. అయితే నిజంగానే పెళ్ళైన హీరోయిన్స్ డిమాండ్ చాలా తక్కువగానే ఉంటుంది. ఒకవేళ సినిమాలు ఉన్నప్పటికీ.. ఆ సినిమాల్లో హీరోయిన్స్ కేరెక్టర్స్ పేలవంగానో మరోలాగో ఉంటాయి. కానీ సమంత మాత్రం పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత ఒకేలాగా కెరీర్ లో దూసుకుపోతుంది. పెళ్లి తర్వాత సమంత నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్. గత ఏడాది అదిరిపోయే హిట్స్ ఖాతాలో వేసుకున్న సమంత ఈ ఏడాది కూడా తన హవా కొనసాగిస్తుంది. ఈ ఏడాది తమిళంలో సూపర్ డీలక్స్ తో అద్భుతమైన హిట్ అందుకోవడమే కాదు.. ఆ సినిమాలోనూ సమంత నటనను అందరూ తెగ పొగిడేస్తున్నారు. విమర్శకులు సైతం సమంత నటనను పొగిడేస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇక తెలుగులో భర్త నాగ చైతన్యతో కలిసి నటించిన మజిలీ చిత్రం నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తన క్రేజ్ తో సమంత భర్త చైతూకి కూడా హిట్ ఇచ్చేసింది. మజిలీ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య నటనకు పోటీగా సమంత నటన ఉందని.. అసలు కొన్ని సీన్స్ లో చైతూని సమంత డామినేట్ చేసిందని.. ప్రేక్షకులు చెబుతున్నమాట.

శ్రావణి పాత్రలో సమంత నటన కూడా అమోఘం. ఆమె కనిపించేది సగం సినిమాలోనే అయినా బలమైన సినిమా హిట్ మీద ముద్ర వేసింది. సమంతకి ఇది వన్ ఆఫ్ ద కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ అనడంలో సందేహం లేదు కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆ పెయిన్ అర్ధమయ్యేలా కేవలం తన కళ్లల్లో ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి. సమంత మంచి నటి అని ఇప్పటికే ఒకటి రెండుసార్లు ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు మజిలీ సినిమాతో మరోసారి రుజువు చేసుకుంది. మరి నిన్నగాక మొన్న సూపర్ డీలక్స్ తో అదరగొట్టిన సమంత నేడు మజిలీలో దున్నేస్తుందన్నమాట.

Good Reports to Samantha Majili Movie:

Samantha gets one more hit with Majili
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs