Advertisement
Google Ads BL

ప్రియుడే ఈ భామని భలే బుక్ చేశాడు..!


ప్రస్తుతం ఏ హీరోయిన్ కి లేని కేజ్ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారకి ఉంది. యావరేజ్ సినిమా అయినా నయనతార క్రేజ్ తో హిట్ అవుతున్నాయి. లేడి సూపర్ స్టార్ గా నయనతార స్టార్ డమ్ ని ఏ హీరోయిన్ అందుకోలేకపోతుంది. ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ సినిమాలకన్నా ఎక్కువగా సస్పెన్సు థ్రిల్లర్ మూవీస్ తో నయనతార దూసుకుపోతుంది. నిన్నగాక మొన్న అంజలి సిబిఐ. ఇక నిన్నటికి నిన్న ఐరా సినిమా టాక్ బాగోకపోయినా... తమిళనాట నయన్ క్రేజ్ తో ఆ సినిమాకి కలెక్షన్స్ బావున్నాయి. ఇక తాజాగా నయనతార నటించిన కొలయుతిర్ కాలం సినిమా విడుదలకు సిద్దమవుతుంది. చక్రి తోలేటి దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రధారిగా కొలయుతిర్ కాలం తెరకెక్కింది.

Advertisement
CJ Advs

వసు భగ్నాని, దీప్సిక దేశ్ ముఖ్ లు కొలయుతిర్ కాలం సినిమాని భారీగా నిర్మించారు. అయితే ఈ సినిమాని నయన్ క్రేజ్ తో నిర్మాతలు భారీగా విడుదలకు ప్లాన్ చెయ్యగా.. ఈలోపు నయనతార బాయ్ ఫ్రెండ్, కాబోయే భర్త అయిన విగ్నేష్ శివన్... కొలయుతిర్ కాలం సినిమాని అనుకున్నది అనుకున్నట్టుగా తియ్యలేకపోవడంతో..  అసంపూర్తిగా అనిపిస్తోందంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు కొలయుతిర్ కాలం బిజినెస్ ని దెబ్బతీసిందట. నిర్మాతలు కొలయుతిర్ కాలం భారీ ధరలకు కొన్ని ఏరియాలను విక్రయించగా.... మరికొన్ని పెండింగ్ ఉన్నాయట. అయితే విగ్నేష్ కామెంట్స్ తో కొలయుతిర్ కాలం కొనడానికి కొత్త బయ్యర్లెవరూ  సాహసం చేయకపోగా... ముందు సినిమా హక్కులను తీసుకున్నవారు  కొంత అడ్వాన్స్ ఇచ్చిన బయ్యర్లు కూడా ఆ అడ్వాన్స్ ని వెనక్కి ఇచ్చెయ్యమని నిర్మాతలు మీద ఒత్తిడి తెస్తున్నారట.

ఇక నిన్నమొన్నటివరకు కొలయుతిర్ కాలం డిజిటల్, శాటిలైట్ హక్కుల కోసం పోటీపడిన వారు ఇప్పుడు తమకొద్దని మొహమాటం లేకుండా కొలయుతిర్ కాలం నిర్మాతలకు చెప్పడంతో.. విగ్నేష్ శివన్ చేసిన కామెంట్స్ తో తమ సినిమా బిజినెస్ దెబ్బతిన్నదని... కొలయుతిర్ కాలం నిర్మాతలు నయన్ ప్రియుడు విగ్నేష్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అలాగే విగ్నేష్ మీద నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసిన నిర్మాతలు... కొలయుతిర్ కాలంకి విగ్నేష్ వలన జరిగిన నష్టాన్ని విగ్నేష్ ద్వారా ఇప్పించాలని వారు పట్టుబడుతున్నారట.

Nayanthara Faces Problems with Vignesh Shivan:

Nayanthara Movie Distributors fires on Her Lover
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs