Advertisement
Google Ads BL

‘లూసిఫర్’ తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?


ఏప్రిల్ 12 న సురేష్ ప్రొడక్షన్స్ వారు విడుదల చేస్తున్న మోహన్ లాల్ ‘లూసిఫర్’ చిత్రం..!!

Advertisement
CJ Advs

జనతా గ్యారేజ్, మనమంతా, మన్యం పులి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. ఇప్పటికే మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 12 న విడుదల చేయనున్నారు. నిన్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేయగా ఆ ట్రైలర్ కి మంచి స్పందన లభించింది... ట్రైలర్ చూసినంత సేపు చాలా ఆసక్తికరంగా సాగింది. మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్,  టివినో థామస్, సానియా ఐయప్పన్, సాయి కుమార్, నీల ఉషా, కళాభవన్ షాజోన్ నటించిన ఈ సినిమాకి మలయాళ అగ్రనటుడు, కథానాయకుడు పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు.. దీపక్ దేవ్ సంగీతం సమకూర్చగా సుజిత్ వాసు దేవ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు..

నటీనటులు: మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్, టివినో థామస్, సానియా ఐయప్పన్, సాయి కుమార్, నీల ఉషా, కళాభవన్ షాజోన్ తదితరులు

సాకేతిక నిపుణులు :

దర్శకుడు: పృథ్వీరాజ్ సుకుమారన్

నిర్మాత: ఆంటోనీ పెరుంబవూర్

బ్యానర్: ఆశీర్వాద్ సినిమాస్

సమర్పణ : సురేష్ ప్రొడక్షన్స్

సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసు దేవ్

సంగీతం: దీపక్ దేవ్

ఎడిటింగ్: సంజీత్ మొహమ్మద్

స్క్రీన్ ప్లే: మురళీ గోపీ

యాక్షన్: స్టంట్ సిల్వ

చీఫ్ అసోసియేట్: వావ

ప్రొడక్షన్ కంట్రోలర్: సిధూ పనక్కల్

ఆర్ట్ : మోహన్ దాస్

మేకప్: శ్రీజిత్ గురువాయూర్

కాస్ట్యూమ్: సుజిత్ సుధాకరన్

‘Lucifier’ Telugu Release Date Fixed:

Suresh Productions to release Mohanlal’s ‘Lucifier’ in Telugu on April 12th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs