Advertisement
Google Ads BL

‘మజిలీ’ టాక్ ముందు నిలబడగలదా?


వేసవి సెలవుల్లో మొదటిసారిగా నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజిలీ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. నాగ చైతన్య - సమంత జంటగా నటించిన మజిలీ మూవీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. మొదటి షోకే మజిలీ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే మజిలీ ప్రమోషన్స్ ని సమంత - నాగ చైతన్యలు కలిసి అదరగొట్టేసారు. ఇద్దరు కాంబో ఇంటర్వూస్ ఇవ్వడం.. అలాగే సమంత సోలో ఇంటర్వూస్, దర్శకుడు శివ నిర్వాణ ఇంటర్వ్యూ , సెకండ్ హీరోయిన్ దివ్యంకా కౌశిక్ లు సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ పెంచారు.

Advertisement
CJ Advs

మరి మజిలీకి పోటీగా ఈ రోజు ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రేమకథా చిత్రం 2 కి పెద్దగా ఊపు కనబడడం లేదు. సోషల్ మీడియాలో ప్రేమ కథా చిత్రం 2 కౌన్ డౌన్ పోస్టర్ తప్ప ఎక్కడా ఆ సినిమా ప్రమోషన్స్ లేవు. అసలు ప్రేమ కథా చిత్రం 2 ఈ రోజు థియేటర్స్ లోకి వస్తుందన్న విషయం చాలామంది ప్రేక్షకులకు తెలియదు కూడా. మరి నందిత స్వేత, సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని లు జంటగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ చాలా వీక్ గా వున్నాయి. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మజిలీ మీద పోటీకి దిగుతున్న ప్రేమ కథా చిత్రం 2 పొజిషన్ ఏమిటనేది మరికొద్దిసేపట్లో తేలిపోతుంది.  

Tough Situation to Premakatha Chitram 2:

Majili got Good Reports at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs